క్రైమ్/లీగల్

కొలిక్కి వస్తున్న జయరాం కేసు విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 3: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్మా కంపెనీల అధినేత చిరుగుపాటి జయరాం హత్య కేసులో కృష్ణా జిల్లా నందిగామ పోలీసుల విచారణ ఓ కొలిక్కి వచ్చింది. సోమవారం నాటికి పూర్తి వివరాలు అందిస్తామని, అప్పటివరకు తామేమీ చెప్పలేమని కృష్ణా ఎస్పీ సర్వేశ్రేష్ట త్రిపాఠి చెబుతున్నారు. నందిగామ పోలీసులు హైదరాబాద్ వెళ్లి అమెరికా నుంచి అక్కడికి చేరుకున్న జయరాం సతీమణి పద్మశ్రీ వాంగ్మూలం నమోదు చేశారు. అయితే తాను మొదటి నుంచి అమెరికాకే పరిమితమైనందున అసలు ఇక్కడ ఏమిజరిగిందో తనకేమీ తెలియదని ఆమె చెప్పినట్లు తెలిసింది. ఇక్కడ ప్రాణరక్షణ లేనందున అమెరికాకు తిరిగి వెళ్లేందుకు తాను సిద్ధవౌతున్నానన్నారు. ఇక వీరి వ్యాపార లావాదేవీలను ఎవరు చూడాల్సివస్తుందో వేచిచూడాల్సి ఉంది. పోస్టుమార్టంలో తెలిసిన ప్రాథమిక ఆధారాలను బట్టి కుక్కలను చంపటానికి వినియోగించే మందుతో నమ్మకంగా జయరాంపై విషప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నారు. ఒక బృందం హైదరాబాద్‌లో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.