ఆంధ్రప్రదేశ్
భర్త ఇంటి వద్ద భార్య ఆందోళన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 6 April 2016
కడప: అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వారు తరచూ వేధించడంతో విసిగి వేసారిన కోడలు భర్త ఇంటి వద్ద బైఠాయించి ఆందోళన ప్రారంభించింది. రాజంపేట గాజులవీధిలో ఈ ఘటన బుధవారం జరిగింది. పోస్టల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న అమర్నాథ్తో బాధితురాలు ప్రియాంకకు రెండేళ్ల క్రితం పెళ్లయింది. తర్వాత కొద్దిరోజులకే అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు, ఆడపడుచు ఆమెను కొట్టడం ప్రారంభించారు. చిత్రహింసలు భరిస్తున్నప్పటికీ బుధవారం ప్రియాంకను ఇంటినుంచి గెంటేసి భర్త, అత్తింటి వారు తాళం వేసి ఎటో వెళ్లిపోయారు. దీంతో తనకు న్యాయం చేయాలని ప్రియాంక భర్త ఇంటి ముందు బైఠాయించింది. భర్త వచ్చేవరకూ తన ఆందోళన కొనసాగిస్తానని ఆమె చెబుతోంది.