బిజినెస్

ఆశ నిరాశల మధ్య..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: భారత స్టాక్ మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతున్నది. ఆశనిరాశల మధ్య ట్రేడింగ్ ఊగిసలాడుతూ, నిపుణులు సైతం ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితిని కల్పించింది. రూపాయి మారకం విలువ పతనం, అంతర్జాతీయ పరిణామాలతోపాటు అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెరపడకపోవడం కూడా భారత స్టాక్ మార్కెట్‌ను ఈ వారం తీవ్రంగా ప్రభావితం చేసింది. గత వారం 36,469.43 పాయింట్ల వద్ద ముగిసిన సెనె్సక్స్ ఈవారం మొదటి రోజునే మెరుగుపడి, 36,582.74 పాయింట్లుగా నమోదైంది. మంగళవారం స్వల్పంగా పెరిగి, 36,616.81 పాయింట్ల వద్ద ముగిసింది. బుధ, గురు వారాల్లో బుల్న్ కొనసాగడంతో సెనె్సక్స్ పరుగులు తీసింది. బుధవారం 358 పాయింట్లు ఎగబాకి 36,975.23 పాయింట్లకు చేరింది. మరుసటి రోజు 4.41 పాయింట్ల స్వల్ప పెరుగులతో 36,979.37 పాయింట్లుగా నమోదైంది. అయితే, ఈ వారం లావాదేవీలకు చివరి వారమైన శుక్రవారం 442.85 పాయింట్లు పతనమై, 36,549.48 పాయింట్లకు చేరింది. వివిధ కంపెనీలు ప్రకటిస్తున్న ఈ ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక ఫలితాలు స్టాక్ మార్కెట్‌పై బలమైన ప్రభావం చూపాయన్నది వాస్తవం. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరగడం, రూపాయి మారకపు విలువ ఇంకా బలపడకపోవడం వంటి అంశాలు కూడా స్టాక్ మార్కెట్‌లో అనిశ్చితిని పెంచాయి. అన్నింటినీ మించి అమెరికాలో ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా అక్కడి కాంగ్రెస్ నిధుల విడుదలను పాక్షికంగా అడ్డుకోవడంతో తలెత్తిన షట్‌డౌన్ సమస్య యావత్ ప్రపంచ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నది. షేర్ల అమ్మకాల జోరు పెరిగినప్పుడు, ఆ వెంటనే తలెత్తే డిమాండ్ మార్కెట్‌కు తాత్కాలికంగా ఊతాన్నిస్తున్నది. కానీ, షేర్ల విలువ పతనమవుతున్న మరుక్షణమే పెట్టుబడిదారులు తమ దృష్టిని బంగారం, వెండి కొనుగోళ్లపై సారిస్తారన్నది వాస్తవం.
ఫలితంగా బులియన్ మార్కెట్ లాభాల బాటలో పరుగులు తీస్తుంది. సహజంగా చోటు చేసుకునే ఈ పరిణామాల్లో, షేర్ల అమ్మకాలు పెరిగి ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయా లేక కొనుగోళ్లతో మార్కెట్ లాభాలను ఆర్జిస్తుందా అనేదే ముఖ్యం. అంతర్జాతీయ మార్కెట్ తీరుతెన్నులు, వివిధ దేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనించి అటు బ్రోకర్లు, ఇటు మదుపరులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. మార్కెట్ నిపుణులు సైతం వారికి సలహాలు, సూచనలు అందిస్తారు. కానీ, గత కొంతకాలంగా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి కొనసాగుతున్నది. హఠాత్తుగా బుల్ రంకెవేసి, మార్కెట్‌ను లాభాల్లో పరుగులు తీయిస్తున్నది. అంతే హఠాత్తుగా అమ్మకాల ఒత్తిడి పెరిగి, బేర్ ఆధిపత్యం కనిపిస్తున్నది. దీనితో మార్కెట్‌లో తదుపరి వ్యూహాలను సిద్ధం చేసుకునే అవకాశం ఎవరికీ లభించడం లేదు. నిపుణులు సైతం మార్కెట్ తీరుతెన్నులపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఇదే డోలాయమానంలో ఈవారం స్టాక్ మార్కెట్ కొట్టుమిట్టాడింది. వచ్చే వారం కూడా అదే అనిశ్చితి కొనసాగే అవకాశాలు లేకపోలేదు.