బిజినెస్

గన్నవరం విమానాశ్రయ నూతన రన్‌వే ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 12: గన్నవరం విమానాశ్రయం వద్ద 3360 మీటర్లు పొడవు, 45 మీటర్ల వెడల్పుతో విస్తరించిన రన్‌వేను కేంద్ర వాణిజ్య, పౌర విమానయాన శాఖామాత్యులు సురేష్‌ప్రభు న్యూఢిల్లీ నుండి వీడియో లింక్ ద్వారా మంగళవారం ప్రారంభించారు. గన్నవరం విమానాశ్రయం వద్ద మంగళవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గన్నవరం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డి మధుసూదనరావు, అధికారులు పాల్గొన్నారు. గన్నవరం విమానాశ్రయటం కార్గో, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దడంలో భాగంగా రన్‌వేను 150 కోట్ల రూపాయలతో అభివృద్ధిపరిచారని ఈ సందర్భంగా మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. బోయింగ్ 747, 777 లాంటి భారీ విమానాలు దిగేందుకు రన్‌వే నిర్మాణం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో గన్నవరం విమానాశ్రయం మరింత అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆకాంక్షించారు. న్యూఢిల్లీ వీడియోకాన్ఫరెన్స్ హాలు నుండి కేంద్ర మంత్రి జయంత్ సిన్హా, భారతీయ విమానయాన సంస్థ చైర్మన్ డాక్టర్ గురుప్రసాద్ మహాపాత్ర, రాష్ట్రానికి చెందిన కేంద్ర మాజీమంత్రి అశోక గణపతిరాజు, పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజు, మాగంటి మురళీమోహన్, కె హరిబాబు, శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు, ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్తవరపు మురళీకృష్ణ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకర్షించాయి.