బిజినెస్

ఆన్‌లైన్ మోసాలకు చెక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు నూతనంగా కృత్రిమ మేథస్సు(ఏఐ)ను శాస్తవ్రేత్తలు అభివృద్ధి చేశారు. యాప్‌లు, వెబ్‌సైట్‌ల రూపంలో జనం జేబులు ఖాళీ అవుతున్న సంగతి తెలిసిందే. లండన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ వార్‌విక్ పరిశోధకులు ఆన్‌లైన్ స్కామ్‌లను అరికట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.కంప్యూటింగ్ లాగర్‌థమ్స్‌ను అభివృద్ధి చేశారు.
ఏది బోగస్/నకిలీ యాప్ లేదా వెబ్‌సైటో కనుగొనడానికి ఏఐ దోహపడుతుంది. పరిశోధకులు అభివృద్ధి చేసిన కృత్రిమ మేథస్సుతో సంబంధింత యాప్/వెబ్‌సైట్ పుట్టుపూర్వోత్తరాలు తెలిసిపోతాయి. ప్రొఫైల్స్, చిత్రాలు, సంబంధిత సంస్థ చరిత్ర మొత్తం వినియోగదారుడికి సాక్షాత్కరిస్తుంది.‘ప్రస్తుతం ఆన్‌లైన్ మోసాలు సాధారణమైపోయాయి. జరిగిన మోసాన్ని బయటకు చెప్పుకోలేని కేసులు ఎన్నో ఉంటున్నాయి’అని వార్‌విక్ వర్శిటీ ప్రొఫెసర్ టామ్ సోరెల్ స్పష్టం చేశారు. ఏఎల్ సాంకేతిక సహాయంతో అనుమానిత కంపెనీల గురించి తెలుసుకోవచ్చని ఆయన అన్నారు. అలాగే ఆన్‌లైన్ మోసాలకు సాధ్యమైనంత వరకూ చెక్‌పెట్టడానికి వీలుంటుందని చెప్పారు. రానున్న కొద్ది సంవత్సరాల్లో దీన్ని మరింత అభివృద్ధి చేసిన అందుబాటులోకి తెస్తామని టామ్ వెల్లడించారు. గిఫ్టుమనీ, రుణాల పేరుతో ప్రజలు ఆన్‌లైన్ మోసాలకు గురవుతున్నారు. 2017లో మూడు వేల మంది బ్రిటీష్ పౌరులు 41 మిలియన్ పౌండ్లు మోసపోయారు.