బిజినెస్

తక్కువ సంఖ్యలో పెద్ద బ్యాంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలో తక్కువ సంఖ్యలో, పెద్ద బ్యాంక్‌లు ఉండడాలన్నదే తన అభిప్రాయమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఆర్థిక రంగం పరిపుష్టం కావడానికి, వేగంగా అభివృద్ధి చెందడానికి ఇది తప్పనిసరి ఆర్‌బీఐ బోర్డు లాంఛన ప్రాయమైన బడ్జెట్ సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ఐదు అనుబంధ బ్యాంక్‌లు, భారతీయ మహిళా బ్యాంక్ కూడా 2017లో ఎస్‌బీఐలో విలీనమయ్యాయి. ఆతర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్, విజయా బ్యాంక్ కలిసిపోయాయి. ఈ అంశాలను జైట్లీ ప్రస్తావిస్తూ, విలీనాల తర్వాత ఎస్‌బీఐ దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా అవతరించిందని, దీని వల్ల ఖాతాదారులకు అత్యుత్తమ సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఎక్కువ సంఖ్యలో బ్యాంక్‌లు ఉన్నంత మాత్రాన లాభం ఉండదని జైట్లీ అన్నారు. తక్కువ సంఖ్యలో, అతి పెద్ద బ్యాంక్‌ల అవసరం ఉందన్నారు. బ్యాంక్‌ల విలీనాల ప్రక్రియను ఆయన సమర్థించారు. ఆర్థిక వ్యవస్థ మెరుగు ఇది అత్యవసరమని తెలిపారు.