కృష్ణ

అన్నదాత-సుఖీభవ కింద అర్హులైన ప్రతి ఒక్క రైతుకీ లబ్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న అన్నదాత - సుఖీభవ పథకానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారుల జాబితాను ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ తెలిపారు. సోమవారం అన్నదాత - సుఖీభవ పథకం అమలుపై వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ అమరావతి నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంగళవారం నాటికి అన్ని గ్రామ పంచాయతీల నోటీసు బోర్డుల్లో అర్హులైన రైతుల వివరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి మండల వ్యవసాయ శాఖాధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. సన్న, చిన్నకారు రైతులకు అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.15వేలు పంటల ప్రోత్సాహకంగా అందచేయనున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద రూ.6వేలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకంగా రూ.9వేలు మొత్తం ప్రతి రైతుకి రూ.15వేలు చొప్పున అందించనున్నట్లు పేర్కొన్నారు. రైతులు, కౌలు రైతుల జాబితాను వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్‌కు అందించాలని కలెక్టర్ వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ టి మోహనరావు, డెప్యూటీ డైరెక్టర్ మణిధర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.