బిజినెస్

పరిస్థితి ఆశాజనకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 24: వరుసగా తొమ్మిది రోజుల పాటు కొనసాగిన పతనం నుంచి బయటపడిన స్టాక్ మార్కెట్ గత వారం లాభాలను ఆర్జించింది. స్టాక్ మార్కెట్‌లో లావాదేవీలు జరిగే ఐదు రోజుల్లో, వరుసగా రెండు రోజులు నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, ఆతర్వాత కోలుకొని, వరుసగా రెండు రోజులు లాభాలను ఆర్జించడం విశేషం. చివరి రోజున స్వల్పంగా పతనమైనప్పటికీ, స్థూలంగా చూస్తే కొత్త వారంలో పరిస్థితి ఆశాజనకంగానే కనిపిస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్లలో సూచీలు పూర్తి ప్రతికూలంగా కొనసాగుతున్నప్పటికీ, భారత్‌లో దాని ప్రభావం మరీ ఎక్కువ కాకపోవడం గమనార్హం. అందుకే, పరిస్థితి ఆశాజనకంగా ఉందని, సోమవారం మొదలయ్యే కొత్త వారంలో స్టాక్ మార్కెట్ మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా, చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి తెరపడకపోవడం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నది. దీనికితోడు అమెరికాలో రీటైల్ మార్కెట్ గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా పతనం కావడం కూడాప్రపంచ మార్కెట్‌ను ఆందోళనకరమైన పరిస్థితుల్లోకి నెడుతున్నది. ముడి చమురు ధర పెరగడం అంతర్జాతీయ విపణికి వేధిస్తున్న మరో సమస్య. వీటికితోడు, రూపాయి మారకపు విలువ స్థిరపడక పోవడం, పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి జరిగిన తర్వాత చోటు చేసుకున్న పరిస్థితులు వంటి సమస్యలు ముంబయి స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ), జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో వరుసగా సెనె్సక్స్, నిఫ్టీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. సర్వత్రా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో, స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలకు గురికావాలి. కానీ, గత వారం భయపడినంత స్థాయిలో ఈ పతనం చోటు చేసుకోలేదు. అందుకే, సోమవారం నుంచి మార్కెట్ స్థిరపడుతుందని, లాభాల్లో నడుతుందని ధీమా వ్యక్తమవుతున్నది. అనూహ్యమైన సంఘటనలు, పరిణామాలు చోటు చేసుకోకపోతే, రాబోయే కాలంలో స్టాక్ మార్కెట్ స్థిరంగా కొనసాగడం ఖాయమని అంటున్నారు.