బిజినెస్

టాటామోటార్స్ నుంచి త్వరలో సరికొత్త మోడల్ ‘ఆల్ట్రోజ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: వెనుక పెద్ద తలుపులున్న ప్రీమియం హాచ్‌బ్యాక్ మోడల్ కారును మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు టాటా మోటార్స్ సంస్థ సోమవారం నాడిక్కడ ప్రకటించింది. ‘అల్ట్రోజ్’ పేరుతో ఈ కారును ఆవిష్కరిస్తామని ఆ సంస్థకు చెందిన అధికారులు వెల్లడించారు. ఆటోఎక్స్‌పో 2018లో ప్రదర్శించిన 45ఎక్స్ కానె్సప్ట్ ఆధారంగా ఆల్ట్రోజ్ వెర్షన్ కార్ల తయారీని చేపట్టామన్నారు. జెనీవా మోటార్స్ షో 2019లో ఈ సరికొత్త కారును ఆవిష్కరించడం జరుగుతుందని కంపెనీ స్పష్టం చేసింది. మారుతీ సుజుకీ ఇండియా కంపెనీకి చెందిన బలెనో, హుండాయ్‌కి చెందిన ఐ20, హోండా జాజ్‌తోబాటు మరికొన్ని ఆధునిక కార్లతో తమ కారు పోటీ పడుతుందన్నారు. ఈ కారు రూ.5.45 లక్షల నుంచి 9.34 లక్షల వరకు ఎక్స్‌షోరూం ఢిల్లీ ధర పలుకుందని వివరించారు. తమ కొత్తవెర్షన్ కారు మార్కెట్‌లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో పరిశ్రమలో సరికొత్త నిర్వచనాన్ని ఇస్తుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల వాణిజ్య విభాగం అధ్యక్షుడు మయాంక్ పరీక్ పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, క్లాస్ లీడింగ్ కనెక్టివిటీ, త్రిల్లింగ్ పనితీరు, స్మార్ట్ ప్యాకేజీలతో ఈ కారు వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటుందన్నారు.