బిజినెస్

జెట్‌ఎయిర్‌వేస్ వాటాలు మూడు శాతం పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ వాటాలు స్టాక్ మార్కెట్లో సోమవారం మూడు శాతం పతనమయ్యాయి. ఈ సంస్థపై స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో దావా వేసేందుకు సిద్ధమవుతుండటంతో ఈ పరిణామం చోటుచేసుకుందని విశే్లషకులు భావిస్తున్నారు. అయితే అలాంటి చర్యలేవీ తీసుకోవడం లేదని ఓవైపు ఎస్‌బీఐ అధికారులు పేర్కొంటున్నారు. రుణాల పునర్‌వ్యవస్థీకరణ, కుదింపుద్వారా నిధులు సమీకరించేందుకు ఈ జెట్ ఎయిర్ వేస్ సంస్థ విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. బకాయిలు చెల్లించకపోవండంతో ఇటీవలే రెండు విమానాల నిర్వహణను సైతం నిలిపివేసింది. కాగా బీఎస్‌ఈలో సోమవారం 3 శాతం నష్టపోయిన ఈ సంస్థ ఒక్కోవాటా మధ్యాహానికి ధర 229.60 రూపాయలకు తగ్గింది. ఇంట్రాడేలో 225 రూపాయలకు తగ్గినా ఆ తర్వాత స్వల్పంగా కోలుకుంది. ట్రిబ్యునల్‌కు వెళ్లి ఈ సంస్థనుంచి రావలసిన బకాయిలు రాబట్టుకుంటామని ఆదివారం ఎస్‌బీఐ అధికారులు ప్రకటించడం స్టాక్‌మార్కెట్‌పై ప్రభావం చూపిందంటున్నారు. ఇతే అలాంటి చర్యలేవీ ప్రస్తుతానికి తమ బ్యాంకు చేపట్టడం లేదని సోమవారం నాడిక్కడ ఎస్‌బీఐకి చెందిన విశ్వసనీయ అధికారి ఒకరు చెప్పారు. బ్యాంకులను మోసం చేయడం, ఉద్దేశపూర్వక దివాళా ప్రకటించడం (ఐబీసీ) చట్టాన్ని మాత్రం ప్రస్తుతానికి మొండి బకాయిల వసూలుకు వినియోగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ట్రిబునల్‌కు వెళ్లాలంటే ముందు ఎన్‌సీఎల్‌టీ అనుమతి పొందాల్సిన ఉంటుందని ఆయన వివరించారు. గత గురువారం జరిగిన జెట్ ఎయిర్‌వేస్ ఎక్స్‌ట్రార్డినరీ జనరల్ బాడీ మీటింగ్ (ఈజీఎం)లో వాటాదార్లు రుణాలను వాటాలుగా మార్చుకునేందుకు అంగీకారం తెలిపారన్నారు, ఐతే అటు బ్యాంకుతోబాటు, ముఖ్య వాటాదార్లతో సంబంధం ఉన్న అధికారులు మాత్రం జెట్ ఎయిర్‌వేస్ వద్ద పూర్తిగా డబ్బులేని పరిస్థితి నెలకొందన్నారు.