బిజినెస్

బీఈఎల్‌కు భారీ ఆర్డర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)కు భారీ ఆర్డర్ లభించింది. 33 మిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్‌ను ఎల్బిట్ సిస్టమ్స్ ఎలక్ట్రో-ఆప్టిక్స్ ఎలాప్ లిమిటెడ్ (ఎలాప్) నుంచి పొందినట్టు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఎల్బిట్ సిస్టమ్స్ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థగా ఉన్న ‘ఎలాప్’ నుంచి ఈ ఆర్డర్ రావడం చాలా ఆనందంగా ఉందని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఎంపిక చేసిన ‘నవరత్న’ కంపెనీల్లో ఒకటైన బీఈఎల్ తన ప్రకటనలో పేర్కొంది. ఈఓఐఆర్ ప్లేలోడ్స్‌తోపాటు, ఇతర రకాలైన పేలోడ్స్‌ను కూడా బీఈఎల్ తయారు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా బీఈఎల్ ఇప్పటికే ‘ఎలాప్’తో సాంకేతిక సహకార ఒప్పందం (టీసీఏ) కుదుర్చుకుంది. తద్వారా ప్లేలోడ్స్ తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ‘ఎలాప్’ నుంచి పొందుతుంది. ఈ ప్లేలోడ్స్‌కు జీవితకాల మెయింటెనెన్స్ సదుపాయాన్ని కూడా ‘ఎలాప్’ అందిస్తుంది. ఇలావుంటే, ఒప్పందం కుదిరిన తర్వాత ఆ కంపెనీ నుంచి బీ ఈఎల్‌కు భారీ ఆర్డర్ లభించడం విశేషం. ఎఓఐఆర్ ప్లేలోడ్స్‌ను తయారుచేసి, సరఫరా చేయగల పూర్తిసామర్థ్యం తమకుందని బీఈఎల్ తన ప్రకటనలో వ్యాఖ్యానించింది. వాటి జీవితకాల నిర్వాహణ బాధ్యతనూ తామే తీసుకుంటామని పేర్కొంది.
పవర్‌గ్రిడ్ నుంచి జీఈకి ఆర్డర్
పవర్‌గ్రిడ్ నుంచి జీఈ టీ అండ్ డీ ఇండియాకు 162 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్ దక్కింది. గుజరాత్‌లోని భుజ్ నగర శివార్లలో 2,500 మెగా వాట్స్ సామర్థ్యంగల వాయు విద్యుత్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసే బాధ్యతను జీఈకి పవర్‌గ్రిడ్ అప్పచెప్పింది. గ్రీన్ ఎనర్జీ పవర్ ట్రాన్స్‌మిషన్ కారిడార్‌కు అవసరమైన సామాగ్రిని తరలించి, అక్కడ ప్రాజెక్టును పూర్తి చేస్తుంది. పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్‌ను తయారు చేసేందుకే ఈ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. భుజ్‌లో 765 కిలోవాట్స్ ఏఐఎస్ సబ్‌స్టేషన్ విస్తరణతోపాటు కొత్తగా 400 కేవీ/ 220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని జీఈ కంపెనీ చేపట్టి, పూర్తి చేస్తుంది.