బిజినెస్

మార్కెట్‌లోకి ‘సిట్రోయన్’ బ్రాండ్ వాహనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: యూరప్‌కు చెందిన ప్రఖ్యాత వాహనాల తయారీ కంపెనీ పీఎస్‌ఏ గ్రూ ప్ త్వరలో ‘సిట్రోయన్’ బ్రాండ్ వాహనాలను మనదేశ మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టనుంది. 2021 నాటికి ఈ కొత్త మోడల్ కార్లు భారత్ రోడ్లపై తిరుగే అవకాశాలున్నాయని పీఎస్‌ఏ గ్రూప్ మేనేజింగ్ బోర్డు చైర్మన్ కార్లోస్ టవరస్ తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆ కంపెనీ పనితీరుపై నివేదికను విడుదల చేసిన సం దర్భంగా మంగళవారం నాడిక్కడ ఆయన ప్రసంగించారు. ఇప్పటికే తమకు భారత్‌లో ఓ విద్యుత్ రైలు ప్లాంటు, వాహనాల తయారీ ప్లాంటు ఉన్నాయని, ఇక సిట్రోయన్‌కు సంబంధించి కూడా పెట్టుబడులను భారత్‌లో ఆరంభించామని, తయారీకి సంబంధించిన ఫుట్‌ప్రింట్‌ను రూపొందించామని అయన చెప్పారు. తమకు ఇందుకు సంబంధించి మంచి భాగస్వామి కూడా సమకూరారని, ప్రత్యేక నెట్‌వర్క్‌ను రూపొందిస్తున్నామని కారోస్ చెప్పా రు. ప్రాథమికంగా వంద మిలియన్ యూరోల పెట్టుబడులతో తమిళనాడులో ఆరంభమయ్యే ఈ ప్రాజెక్టుతో భారత మార్కెట్లోకి తిరిగి ప్రవేశించేందుకు సీకే బిర్లా గ్రూప్ భాగస్వామ్యాన్ని తీసుకుంటున్నామన్నారు.