బిజినెస్

త్వరలో సరికొత్త రూ.100 నోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 26: త్వరలో సరికొత్త సిరీస్ రూ.100 కరెన్సీ నోట్లను చలామణిలోకి తీసుకురానున్నట్టు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం నాడిక్కడ తెలిపింది. మహాత్మా గాంధీ కొత్త సిరీస్ నుంచి విడుదల చేయనున్న ఈ రూ.100 డినామినేషన్ నోట్లపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ అధికారులు వివరించారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.100 కరెన్సీ నోట్ల డిజైన్ల తరహాలోనే ఈ సరికొత్త నోట్లు కూడా ఉంటాయని, అలాగే గతంలో విడుదలైన అన్ని రూ.100 నోట్లు సైతం చట్టబద్ధమైన చలామణిలో ఉంటాయని ఈ సందర్భంగా ఆర్బీఐ అధికారులు స్పష్టం చేశారు.