బిజినెస్

స్టాక్ మార్కెట్లను దెబ్బతీసిన సరిహద్దు టెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ వాయుసేన దాడులను చేపట్టిన క్రమంలో ఆ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్‌లో మదుపర్ల సెంటిమెంట్‌ను బలహీనపరచింది. దీంతో సూచీలు మంళవారం నష్టాలను నమోదు చేశాయి. ప్రత్యేకించి బీఎస్‌ఈ సెనె్సక్స్ 240 పాయింట్ల దిగువన నమోదైంది. నిన్న అంతర్జాతీయంగా మంచి సానుకూలతలు అందుకున్న ఈక్విటీలు, ఫైనాన్షియల్, రియాలిటీ వాటాలు సైతం అమ్మకాల వత్తిడికి గురయ్యాయి. 30 షేర్ల సెనె్సక్స్ ఆరంభంలో 500 పాయింట్లు కోల్పోయి ఆందోళనకరంగా మారినప్పటికీ తర్వాత కొంతమేర కోలుకుని 239.67 పాయింట్ల నష్టంతో 35,714.16 పాయింట్ల వద్ద ముగిసింది. సోమవారం నాడు సెనె్సక్స్ ఒక్కసారిగా 342 పాయింట్లు ఎగబాకిన సంగతి తెలిసిందే. కాగా 50 షేర్ల నిఫ్టీ సైతం మంగళవారం 44.80 పాయింట్లు కోల్పోయి 0.41 శాతం నష్టాలతో 10,888.75 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, రియాలిటీ, పీఎస్‌యూ కౌంటర్లలో నష్టాలు అధికంగా నమోదయ్యాయి. ప్రధాన ఆసియన్ మార్కెట్లలో తలెత్తిన వ్యతిరేకతలు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసిందని విశే్లషకులు భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాబోయే రోజుల్లో స్టాక్ మార్కెట్ల పరిస్థితి అస్థిరంగా ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. కాగా రూపాయి మారకం విలువ విలువ సైతం 38 పైసలు తగ్గి అమెరికన్ డాలర్‌తో 71.35 రూపాయలకు చేరింది. సెషన్ ఆరంభంలో బాగా నష్టపోయిన రూపాయి విలువ 71.06 రూపాయలకు చేరింది. ఆ తర్వాత మధ్యాహ్నానికి 29 పైసలు బలపడింది. ఐతే సోమవారం నాటి విలువతో పోలిస్తే ఇప్పటికీ 9 పైసలు తక్కువే.
అధికంగా నష్టపోయిన హెచ్‌సీఎల్, టెక్
సెనె్సక్ ప్యాక్‌లో మంగళవారం హెచ్‌సీఎల్, టెక్ అత్యధికంగా 2.26 శాతం నష్టపోయాయి. ఈక్రమంలోనే హెచ్‌డీఎఫ్‌సీ 2.10 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.08 శాతం, ఇన్ఫోసిస్ 1.75 శాతం, ఎస్‌బీఐ 1.44 శాతం, వేదాంత 1.20 శాతం, హీరోమోటోకార్ప్ 1.15 శాతం, ఆర్‌ఐఎల్ 1.01 శాతం, ఎల్ అండ్ టీ ఒక శాతం వంతున నష్టపోయాయి. ఇక భారతీ ఎయిర్‌టెల్ 0.88 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 0.79 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.72 శాతం, ఐటీసీ 0.65 శాతం, కోటక్ బ్యాంక్ 0.44 శాతం, ఓఎన్‌జీసీ 0.37 శాతం, మారుతీ సుజకీ 0.36 శాతం, పవర్ గ్రిడ్ 0.36 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.27 శాతం, హెచ్‌యూఎల్ 0.19 శాతం, ఎం అండ్ ఎం 0.15 శాతం, టాటాస్టీల్ 0.14 శాతం, సన్‌పార్మా 0.03 శాతం నష్టపోయాయి. ఐతే బజాజ్ ఆటో, ఆసియన్ పెయింట్స్ కొంత వరకు లాభాలను సంతరించుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో హిందూస్థాన్ కార్పొరేషన్ వాటాలు 0.74 శాతం నష్టపోయాయి. మార్చి 29 నుంచి హెచ్‌పీసీ స్థానంలో బ్రిటానియా ఇండస్ట్రీస్‌ను నిఫ్టీ-50 సూచీల్లో భాగస్వామిని చేయనున్నట్టు అధికారులు ప్రకటించడం హెచ్‌పీసీ వాటాలపై ప్రభావం చూపిందంటున్నారు, ఇక రంగాల వారీగా తీసుకుంటేబీ బీఎస్‌ఈ రియాలిటీ సూచీ 1.63 శాతం నష్టపోగా, బ్యాంకెక్స్ 0.75 శాతం, కేపిటల్ గూడ్స్ .69 శాతం, ఎఫ్‌ఎమ్‌సీజీ 0.47 శాతం, వినిమయ వస్తువులు 0.43 శాతం, వౌలిక వసతుల రంగం 0.38 శాతం, పీఎస్‌యూ 0.20 శాతం, ఐటీ 0.16 శాతం, హెల్త్‌కేర్ 0.13 శాతం వంతున నష్టపోయాయి. మరోవైపు వాహన రంగ సూచీ అత్యధికంగా 0.32 శాతం లాభపడింది. అలాగే చమురు, సహజవాయులు 0.18 శాతం, విద్యుత్ 0.10 శాతం, లోహ 0.07 శాతం, టెక్ 0.04 శాతం వంతున లాభాలను అందుకున్నాయి.
స్వదేశీ మదుపర్ల వాటాల విక్రయం
స్వదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం 1,764.4 కోట్ల రూపాయల విలువైన వాటాల విక్రయానికి పాల్పడ్డారు. ఐతే విదేశీ సంస్థాగత మదుపర్లు మాత్రం 2,134 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు చేశారు. ఇలావుండగా ఆసియా పరిధిలో షాంఘయ్ కాంపోజిట్ సూచీ 0.61 శాతం నష్టపోగా, హాంగ్‌కాంగ్‌కు చెందిన హ్యాంగ్‌సెంగ్ 0.61 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.37 శాతం, కొరియాకు చెందిన కోస్పి 0.32 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.32 శాతం వంతున నష్టపోయాయి.