బిజినెస్

ఆర్థిక లావాదేవీల్లో వ్యక్తిగత గుర్తింపునకు సరికొత్త సాఫ్ట్‌వేర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 27: బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ముఖ చిత్రం ద్వారా కస్టమర్లను గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి ‘నో యువర్ కస్టమర్’ (కేవైసీ) మ్యాపింగ్‌కు తోడ్పడాలన్న సరికొత్త ప్రతిపాదన రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. ఆర్థిక, బ్యాంకింగ్ లావాదేవీలకు ఆధార్‌ను ప్రాతిపదికగా తీసుకోరాదన్న సుప్రీం కోర్టు ఆదేశాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో ఇందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై పేమెంట్ ఇండస్ట్రీ దృష్టిసారించింది. ప్రస్తుతం ఆర్థిక రంగంలోప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా వౌఖిక గుర్తింపు సాంకేతికతను, కేవైసీ సూత్రాలను అనుసరించడం లేదు. ఈక్రమంలో పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) సరికొత్త విధానాన్ని ఆర్బీఐకి ప్రతిపాదించింది. ఈమేరకు పెద్ద మొత్తాల్లో ఆర్థిక లావాదేవీలు చేయగోరే ఖాతాదారుడు తొలుత తన ఫొటోతో ఉన్న డాక్యుమెంట్‌ను అప్‌లోడ్ చేసి, ఆ తర్వాత కెమెరా ముందు కూరోవాల్సివుంటుందని పీసీఐ చైర్మన్ నవీన్ సూర్య బుధవారం నాడిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ తెలిపారు. ఆర్థిక గణాంకాలు, ఇతర కార్యకలాపాలకు సంబంధించిన కంప్యూటర్ విధానం ‘ఆల్గోరిథం’ ద్వారా తొలుత అప్‌లోడ్ అయిన డాక్యుమెంట్ తాలూకు అధికారితను కనుగొంటారు. ఆ తర్వాత కెమెరా ముందు కూర్చున్న వ్యక్తితో ఆ డాక్యుమెంట్‌లోని ఫొటోను పోల్చిచూస్తారు. ఇందులో కేవైసీకి కావాల్సిన వివరాలన్నీ తెలుస్తాయని నవీన్ సూర్య తెలిపారు. అయితే ఈప్రతిపాదనపై ఇప్పటి వరకు ఆర్బీఐ నుంచి సానుకూల స్పందన రాలేదని ఆయన చెప్పారు. బహుశా మరో ఆరు నెలల కాలంలో తమ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. ఏదేమైనప్పటికీ ఆధార్‌కు ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన చెప్పారు. డీ మానిటరైజేషన్ అనంతరం వచ్చిన స్పందనతో పోలిస్తే ప్రస్తుతం ఎలక్ట్రానిక్ లావాదేవీలు సుమారు 10 శాతానికి తగ్గిపోయాయని ఆయన చెప్పారు. పెద్దనోట్ల రద్దు తర్వాత సుమారు 12 శాతానికి చేరుకున్న ఎలక్ట్రానిక్ లావాదేవీలు ప్రస్తుతం 2 శాతం తగ్గిపోయాయన్నారు. నగదు వినియోగానికి వ్యతిరేకంగా పోరాడాలన్నదే తమ మండలి లక్ష్యమన్నారు. ప్రస్తుతం జరుగుతున్న చిన్నచిన్న దేశీయ పోర్ట్‌పోలియో మదుపర్ల లావాదేవీలకు కేవైసీ సూత్రాలు అనుసరించాల్సిన అవసరం లేదని, పెద్దస్థాయి లావాదేవీలకు తప్పనిసరిగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.