బిజినెస్

బులియన్ మార్కెట్‌కు ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: భారత స్టాక్ మార్కెట్లలో బుధవారం సెనె్సక్స్, నిఫ్టీ పాయింట్లు పతనం కావడం బులియన్ మార్కెట్‌కు ఊతమిచ్చింది. షేర్లపై పెట్టుబడులకు వెనుకంజ వేసిన పెట్టుబడిదారులు, అందుకు ప్రత్యామ్నాయంగా బంగారం, వెండి కొనుగోళ్లపై ఆసక్తిని ప్రదర్శించారు. దేశీయ జ్యుయెలరీ తయారీదారులు, రీటైలర్ల నుంచి డిమాండ్ ఉండడంతో, పది గ్రాముల బంగారం ధర 120 రూపాయలు పెరిగి, 34,650 రూపాయలకు చేరింది. అదే విధంగా కిలో వెండి ధర 70 రూపాయలు అధికమై, 41,475 రూపాయల వద్ద ముగిసింది. ఈనెల 23న అత్యల్పంగా 34,360 రూపాయలుగా ఉన్న పది గ్రాముల బంగారం ధర ఆతర్వాత కోలుకుంది. 26న స్వల్పంగా 60 రూపాయలు పతనమైంది. కానీ, బుధవారం మళ్లీ కోలుకొని, లాభాల బాట పట్టింది. వెండి కూడా మంగళవారం 41,405 రూపాయలకు పతనం కాగా, బుధవారం మళ్లీ కోలుకోవడం బులియన్ మార్కెట్‌లో మదుపరులకు ఊరటనిచ్చింది.