బిజినెస్

ఏపీలో ‘ఏడెక్కో’ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులకు ‘ఏడెక్కో’ సంస్థ ముందుకొచ్చింది. భారత్‌లో పెద్దఎత్తున వ్యాపారాన్ని విస్తరించే ఆలోచన ఉందని ఇందులో భాగంగా ఏపీలో సంస్థను ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్లు ‘ఏడెక్కో’ సంస్థ కంట్రీ హెడ్ మార్కో వాల్సెచి, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బాలాజీ స్వామినాథన్ వెల్లడించారు. ఇందులో భాగంగా బుధవారం ఉండవల్లి ప్రజావేదిక సమావేశమందిరంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఏడెక్కో ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటిగా ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అంతర్జాతీయంగా 5100 శాఖల్లో 33వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. టెంపరరీ స్ట్ఫాంగ్, పర్మినెంట్ ప్లేస్‌మెంట్, నైపుణ్యాభివృద్ధి, ఔట్‌సోర్సింగ్, కన్సల్టింగ్ సర్వీసెస్‌ను సంస్థ అందిస్తుంది. ఏపీలో ఐటి రంగం అభివృద్ధికి తీసుకున్న చర్యల గురించి మంత్రి లోకేష్ వివరించారు. ఐటీ రంగం అభివృద్ధికి ప్రవేశపెట్టిన పాలసీలు, రాయితీలను విశదీకరించారు. హెచ్‌సీఎల్, ఆదానీ లాంటి పెద్ద కంపెనీలు రాష్ట్రానికి రావడానికి ప్రభుత్వం శరవేగంతో నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నదనే అంశాలపై చర్చించారు. ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, హెచ్‌ఆర్ సొల్యూషన్స్ అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇందుకు ప్రభుత్వం నుండి సహకారం కావాలని కోరారు. సంస్థ ఏర్పాటుకు తగిన సహకారం అందిస్తామని లోకేష్ స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ పెద్ద కంపెనీలకు మానవ వనరులను అందిస్తున్న ఏడెక్కో కంపెనీ ఏపీ యువతకు అధునాతన టెక్నాలజీలో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సహకరించాలని మంత్రి లోకేష్ కోరారు. ఇలావుంటే, ఐటీ రంగంలో వస్తున్న విప్లవామత్మక మార్పులు, అధునాతన టెక్నాలజీలు, నైపుణ్య అభివృద్ధి తదితర రంగాల్లో పూర్తి సహకారం అందిస్తామని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.

చిత్రం.. ఉండవల్లి ప్రజావేదిక సమావేశ మందిరంలో మంత్రి లోకేష్‌తో భేటీ అయిన ఏడెక్కో కంపెనీ ప్రతినిధులు