బిజినెస్

మూడో రోజూ నష్టాల్లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 28: వరుసగా మూడోరోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో నడిచాయి. అయితే గురువారం ఈ నష్టాలు స్వల్ప స్థాయికే పరిమితం కావడం గమనార్హం. బీఎస్‌ఈ సెనె్సక్స్ 37.99 పాయింట్లు కోల్పోయి 0.11 శాతం నష్టాలతో 35,867.44 వద్ద స్థిరపడగా, నిఫ్టీ సైతం ఊగిసలాటకు గురై 15.70 పాయింట్లు కోల్పోయి 0.13 శాతం నష్టాలతో 10,792.50 వద్ద స్థిరపడింది. భారత-పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న టెన్షన్ ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చన్న కథనాలతో మదుపర్లలో కొంత సానుకూల దృక్పపథం ఏర్పడింది. కాగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) కాంట్రాక్టు కాలవ్యవధి ముగింపు సైతం మదుపర్లను ఆచితూచి నిర్ణయం తీసుకునేలా చేసిందంటున్నారు. ఆసియన్ మార్కెట్ల నుంచి వచ్చిన వ్యతిరేకతతోబాటు, యూరప్ దేశాల నుంచి సానుకూలత లేకపోవడం మార్కెట్ మూడ్‌ను ప్రభావితం చేసిందని అంటున్నారు. తొలుత మంచి ఊపుమీద ఆరంభమైన బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 36,085.85కు ఎగబాకింది. విదేశీ పెట్టుబడులు బాగా రావడం ఊతమిచ్చింది. అయితే ఆ తర్వాత దేశీయ మదుపర్లు వాటాల విక్రయాలకు పాల్పడంతోబాటు దేశ, విదేశ పెట్టుబడులు తగ్గడంతో సూచీలు మళ్లీ దిద్దుబాటుకు గురై సెనె్సక్స్ 35,829.15కి దిగివచ్చింది. తర్వాత స్వల్పంగా కోలుకుని 35,867.44 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా ఒక దశలో 10,865.70-10,792.50 మధ్య ఊగిసలాడింది. కాగా సరిహద్దు టెన్షన్ ఎక్కువ కాలం ఉండకపోవచ్చన్న ఊహాగానాలతో స్మాల్ కాప్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఒక రోజు వ్యవధిలో వెల్లడికానున్న దేశ ఆర్థికాభివృద్ధి గణాంకాలు, వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు పరిణామాలను పరిశీలిస్తున్న విదేశీ సంస్ధాగత మదుపర్లు వాటాలు కొనుగోళ్లు అధికంగా చేశారని, అ కారణంగా రూపాయి మారకం విలువ సైతం పెరిగిందని ఆర్థిక రంగ నిపుణులు అంచనావేస్తున్నారు.
టీసీఎస్‌కు అధిక నష్టాలు
సెనె్సక్స్ ప్యాక్‌లో టీసీఎస్ అధికంగా 3.38 శాతం నష్టపోయింది. అలాగే మారుతీ సుజుకీ 1.77 శాతం, హీరోమోటోకార్ప్ 1.49 శాతం, ఎం అండ్ ఎం 1.42 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.18 శాతం, టాటాస్టీల్ 0.90 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.67 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 0.63 శాతం, బజాజ్ ఆటో 0.54 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.45 శాతం, కోటక్ బ్యాంక్ 0.28 శాతం, హెచ్‌యూఎల్ 0.25 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 0.23 శాతం, ఇన్ఫోసిస్ 0.10 శాతం వంతున నష్టాలను సంతరిచుకున్నాయి. ఇలావుండగా గురువారం లాభపడిన సంస్థల్లో ఓఎన్‌జీసీ అగ్ర భాగాన నిలిచింది. 4.17 శాతం అదనంగా ఈ సంస్థకు లాభాలు చేకూరాయి. అలాగే కోల్ ఇండియా 3.16 శాతం లాభపడింది. వీటితోబాటు వేదాంత, ఎన్‌పీటీసీ, యెస్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌పార్మా, ఆర్‌ఐఎల్, పవర్‌గ్రిడ్, ఐటీసీ, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఆసియన్ పెయింట్స్ దాదాపు 2.68 శాతం లాభపడ్డాయి. ఇక రంగాల వారీగా చూసే బీఎస్‌ఈలో ఐటీ వాటాలు 1.02 శాతం మేర అధిక నష్టాల పాలయ్యాయి. అలాగే టెక్ 0.93 శాతం, వాహనాలు 0.67 శాతం వంతున నష్టపోయాయి. ఐతే వినిమయ వస్తువులు, చమురు సహజవాయులు, కేపిటల్ గూడ్స్, పీఎస్‌యూ, రియాలిటీ, విద్యుత్, ఎఫ్‌ఎంజీసీ, బ్యాంకెక్స్ సూచీలు 1.29 శాతం లాభపడ్డాయి. ఇక బ్రాడర్ మార్కెట్ల విషయానికొస్తే స్మాల్‌క్యాప్ సూచీలు 0.86 శాతం, మిడ్‌క్యాప్ సూచీలు 0.49 శాతం మేర లాభాలను సంతరించుకున్నాయి. ఈక్రమంలో విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు 423.04 కోట్ల విలువైన వాటాలను బుధవారం కొనుగోలు చేశారు. అలాగే దేశీయ సంస్థాగత మదుపర్లు 66.81 కోట్ల విలువైన వాటాలు కొన్నారు. ఇక ఆసియా పరిధిలోని కొరియాకు చెందిన కోస్పి 1.76 శాతం నష్టపోగా, జపాన్‌కు చెందిన నిక్కీ 0.79 శాతం, స్ట్రెయిట్ టైమ్స్ 0.97 శాతం, షాంఘయ్ కాంపోజిట్ సూచీ 0.44 శాతం వంతున నష్టాలను నమోదు చేశాయి. యూరప్ మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఫ్రాంక్‌ఫర్ట్‌కు చెందిన డీఏఎక్స్ 0.31 శాతం, ప్యారిస్‌కు చెందిన సీఏసీ-40 0.13 శాతం, లండన్‌కు చెందిన ఎఫ్‌టీఎస్‌ఈ 0.82 శాతం వంతున నష్టపోయాయి.