బిజినెస్

వడ్డీ రేట్లపై కోత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 28: ద్రవ్యోల్బణం వచ్చే అక్టోబర్ వరకు సుమారు 4 శాతానికి లోబడి ఉండే క్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వడ్డీ రేట్లపై 75 నుంచి 100 బేసిక్ పాయింట్ల మేర కోత విధించే అవకాశాలున్నాయి. ఈనెలలో తీసుకున్న కొన్ని విధాన నిర్ణయాల వల్ల మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం లేకపోలేదని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. 2020 ఆర్థిక సంవత్సరం వరకు ద్రవ్యోల్బణం సరాసరి 3.8 శాతంగా ఉండే అవకాశాలున్నాయని స్విస్ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ అధ్యయన నివేదిక వెల్లడించింది. వరుసగా ఐదేళ్లపాటు ఆహార లభ్యత, సాధారణ రుతుపవనాలు, స్థిరమైన ముడిచమురు ధరలను పరిగణనలోకి తీసుకుని ఈ అధ్యయనం జరిగింది. ఈనెల 7న జరిగిన ఆరవ బై మంత్లీ మానిటరీ విధాన నిర్ణాయక సమావేశంలో ఆర్‌బీఐ రెపోరేట్‌ను 25 బేసిస్ పాయింట్ల మేర (6.25 శాతం) తగ్గించిన సంగతి తెలిసిందే. అలాగే తన విధానాన్ని సైతం నిష్పాక్షికంగా మార్చుకుంది. తద్వారా రేట్ల విషయం లో తన వైఖరిని తదుపరి కూడా సానుకూలంగా ఉంటుందన్న సంకేతాలను ఆర్‌బీ ఐ పంపింది. తక్కువ రుణాలు మంజూరుతోబాటు, డిపాజిట్ల అభివృద్ధి అనుకున్నంతగా జరగకపోవడం వల్ల ద్రవ్య లావాదేవీల్లో తగ్గుదల నెలకొంది. అందువల్ల 2020 ఆర్థిక సంవత్సరంలో 75 నుంచి 100 బేసిస్ పాయింట్ల మేర సౌలభ్యాన్ని కలిగించేందుకు ఆర్‌బీఐ చర్యలు చేపట్టే అవకాశాలున్నాయని నివేదిక పేర్కొంది.