బిజినెస్

రూ. 215 కోట్లతో డీఎక్స్‌ఎన్ పరిశ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో డీఎక్స్‌ఎన్ పరిశ్రమల్లో ఆరునెలల్లో ఉత్పత్తులు తయారు కాలాలన్నదే తన లక్ష్యమని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈ పరిశ్రమతో నియోజక వర్గంలో వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపటమే ధ్యేయమన్నారు. సిద్దిపేట జిల్లా మందపల్లి పారిశ్రామికవాడలో మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటించి, డీఎక్స్‌ఎన్ నిర్మాణ పనులను క్షేత్ర పనుల పురోగతిని పర్యవేక్షించారు. ఈమేరకు టీఎస్‌ఐఐసీ జిల్లా మేనేజర్ శివప్రసాద్, డీఎక్స్‌ఎన్ సంస్థ ప్రతినిధులు సులేమాన్ జాఫర్, నసీర్‌లతో కేటాయించిన స్థలంలో పర్యటించి పనుల పురోగతిపై సమీక్షించారు. ఈసందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ డీఎక్స్‌ఎన్ పరిశ్రమతో 1500 మందికి ప్రత్యక్షంగా, 2వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకావాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. రానున్న 15రోజుల్లో పనులు ప్రారంభించనున్నానని, 6నుండి 8 నెలల్లో మొదటి విడుత ప్రొడక్షన్ లోకి వస్తామని, సమీక్షలో డీఎక్స్‌ఎన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. పలు అనుమతులకు క్లియరెన్స్ రాగానే మార్చి నెలలోపు మొదటి దశలో పనులు పూర్తి చేసి చేపట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈమేరకు కంపెనీ విధి, విధానాలపై ఆరా తీయగా 175 కోట్ల రూపాయల వ్యయంతో మొదలుపెట్టి, మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం 215కోట్ల రూపాయలు అంచనా వేసినట్లు కంపెనీ ప్రతినిధులు హరీష్‌రావుకు విధి,విధానాలు వివరించినట్లు తెలిపారు. రైస్‌మిల్లు, అయిల్‌మిల్లులు, బ్యాటరీ, ఇతరత్రాపరిశ్రమలు సిద్దిపేట ఇండస్ట్రీయల్ పార్కులోకి వచ్చాయని ఎండీ శివప్రసాద్ పేర్కొన్నారు. హరీష్‌రావు మాట్లాడుతూ ప్రాజెక్టు తొందరగా పూర్తి కావాలని, రైతులకు ఉత్పత్తుల ఇవ్వటంతో పాటు, రైతులకు శిక్షణ, ఈప్రాంతాల వారితో చేసుకోవాల్సిన ఓప్పందం, అంశాలపై చర్చించి వీలైన తొందరగా పనులు పూర్తి చేయాలని సూచించారు. అంతర్జాతీయ డీఎక్స్‌ఎన్ కంపెనీ నిర్మాణ పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. ప్రపంచంలో మలేషియా, ఇండియా దేశాల్లో మాత్రమే అంతర్జాతీయ డీఎక్స్‌ఎన్ కంపెనీ ఉందని, ఈ రెండు దేశాల నుండి 144 దేశాలకు ఎగుమతులు చేస్తుందని వివరించారు. మన భారతదేశంలో పాండీచ్చేరీ, హిమాచల్‌ప్రదేశ్‌లోని బుద్ధి, ఒరిస్సాలోని భువనేశ్వర్, అస్సాం రాష్ట్రంలోని గౌహతితో పాటు తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో అంతర్జాతీయ డీఎక్స్‌ఎన్ పరిశ్రమ నెలకొల్పుతున్నట్లు తెలిపారు.
డీఎక్స్‌ఎన్ వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేయాలి
డీఎక్స్‌ఎన్ కంపెనీ ప్రతినిధులు, కొంత మంది సిబ్బందితో కూడిన వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేయాలని, ఆగ్రూపులో తాను కూడ భాగస్వామిగా ఉంటానని, రోజు,రోజు నివేదిక ఇవ్వాలని, తాను స్వీయ పర్యవేక్షణ చేస్తానని మాజీ మంత్రి హరీష్‌రావు తెలిపారు. తనకున్న ఆలోచనను విజన్‌కు అనుకూలంగా పనులు వేగవంతంగా చేయాలని, కంపెనీ ప్రతినిధులకు సూచించారు. కంపెనీ ప్రతినిధులు ఈ విజన్‌కు అనుకూలంగా పనులు చేస్తామని హామీనిచ్చారు. మందపల్లి గ్రామ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో శిక్షణ ఇప్పించి వారికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కంపెనీ ప్రతినిధులు ప్లాన్ -1, ప్లాన్-2 మ్యాపులను చూపించారు. మందపల్లి చివరి నుండి ఇండస్ట్రియల్ పార్కుకు అవసరమైన రహదారిని మార్గం సుగమం చేయాలని నంగునూర్ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డికి ఆదేశించారు. ఈసమీక్షలో టీఎస్‌ఐఐసీ అధికారిక సిబ్బంది, డీఎక్స్‌ఎన్ ప్రతినిధులు తదితరుల పాల్గొన్నారు.
చిత్రం.. డీఎక్స్‌ఎన్ కంపెనీ నిర్మాణ మ్యాపును పరిశీలిస్తున్న మాజీ మంత్రి హరీష్‌రావు