బిజినెస్

తగ్గిన పసిడి, వెండి ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 1: దేశ, విదేశాల్లో డిమాండ్ తగ్గడంతో శుక్రవారం బంగారు, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాములు (తులం) బంగారంపై 120 రూపాయలు తగ్గి 34,080 రూపాయలు పలికింది. అలాగే వెండి ధరలు సైతం కిలోపై 370 రూపాయలు తగ్గి 40,680కి దిగివచ్చింది. పరిశ్రమల యూనిట్లు, నాణేల మార్కెట్ల నుంచి డిమాండ్ తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొందని వ్యాపార వర్గాలు తెలిపాయి. అమెరికా ఆర్ధికాభివృద్ధి గణాంకాలు అధిక వృద్ధిని చూపడంతో డాలర్ బలపడిందని ఇందువల్ల మనదేశంలో బంగారం ధరలు రెండు వారాల దిగువకు చేరాయని వాణిజ్య రంగ నిపుణులు అంచనావేస్తున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్‌పై 0.28 శాతం తగ్గి 1,310.20 డాలర్లకు చేరింది. అలాగే వెండి సైతం ఔన్సుపై 0.22 శాతం తగ్గి న్యూయార్క్‌లో 15.64 డాలర్లకు చేరింది. ఇక దేశీయంగా స్థానిక వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో 99.9 శాతం స్వచ్ఛత గల బం గారం పది గ్రాములపై 120 రూపాయలు తగ్గి 34,080 రూపాయలు, 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం పది గ్రాములపై 33,910 రూపాయలకు తగ్గింది. గురువారం సైతం బంగారం ధర రూ.450 తగ్గింది. ఇక 8 గ్రాముల సవరం బంగారం సైతం రూ.100 తగ్గిపోయి 26,500 పలికింది. అలాగే వీక్లీ ప్రాతిపదికన జరిగే సరఫరాలో నూ వెండిపై రూ.724 తగ్గి 39,144కు చేరింది. నాణేలు కూడా నష్టాల వత్తిడికి గురై అమ్మకాల్లో 100 పీసులకు రూ.81 వేలు, విక్రయాల్లో రూ.82 వేల వంతున పలికింది.