బిజినెస్

పసిఫిక్ మహాసముద్రంలో కొట్టుకుపోయిన నౌక నుంచి భారీగా చమురు లీకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, మార్చి 1: పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన ఓ పర్యావరణ వైపరీత్యం కారణంగా హాంగ్‌కాంగ్‌కు చెందిన అతిపెద్ద నౌక ఒకటి సోలోమన్ ఐల్యాండ్‌లోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్థలం సమీపంలోకి కొట్టుకుపోయింది. దెబ్బతిన్న ఈ నౌక నుంచి పెద్దయెత్తున చమురు నిల్వలు లీక్ అవుతున్నాయని ఆస్ట్రేలియా దేశపు అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఫిబ్రవరి 5 నుంచి ఇలా ఈ నౌక నుంచి చమురు లీక్ అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ లీకేజీని అరికట్టేందుకు అతి తక్కువ ప్రయత్నాలే జరిగినట్టు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన అనంతరం అక్కడి ఆస్ట్రేలియన్ హైకమిషన్ తెలిపింది. దాదాపు 80 టన్నుల వరకు చమురు ఈ సముద్ర తీర ప్రాంతంలో ఇప్పటి వరకు లీక్ అయిందని ఇంకా ఈ నౌకలో దాదాపు 660 టన్నుల చమురు నిల్వలున్నాయని, అసలే పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ప్రాంతమైన సోలోమన్ ప్రాంతంలో మరింతగా చమురు లీక్ అయితే ఏ విపత్కర పరిణామం ఏర్పడుతుంతోనని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.