బిజినెస్

3 శాతం లాభపడిన ఎస్ బ్యాంకు వాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 1: ఎస్ బ్యాంక్ వాటాలు శుక్రవారం దాదాపు 3శాతం లాభపడ్డాయి. ఈ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా మూడేళ్ల కాల వ్యవధికి రవనీత్ గిల్ బాథ్యతలు చేపట్టినట్టు బ్యాంకు అధికారులు ప్రకటించిన వెంటనే స్టాక్ మార్కెట్‌లో ఈ బ్యాంకు వాటాలకు సానుకూలతలు ఆరంభం కావడం గమనార్హం. ఎన్‌ఎస్‌ఈలో తొలుత 2.68 శాతం లాభపడి ఒక్కో వాటా ధర 237 రూపాయలకు చేరుకోగా ఆ తర్వాత మరింత లాభపడి 3 శాతం లాభాలతో 236.90 రూపాయల వద్ద ముగిసింది. ఇక వాణిజ్యం విషయానికి వస్తే బీఎస్‌ఈలో దాదాపు 35.43 లక్షల వాటాలు, ఎన్‌ఎస్‌ఈలో 4 కోట్ల యూనిట్ల మేర ట్రేడ్ అయ్యాయి. కాగా రవనీత్‌నీత్ గిల్ ఎస్ బ్యాంకు ఎండీ, సీఈవోగా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన 2022 ఫిబ్రవరి 28 వరకు పదవిలో కొనసాగుతారు. ఆయన నియామకాన్ని వాటాదార్లు ఆమోదించాల్సి ఉంది. వచ్చే జూన్‌లో జరిగే బ్యాంకు సర్వసభ్య సమావేశంలో ఈ ఆమోదం జరుగుతుంది.