బిజినెస్

కర్నాటక బ్యాంక్‌కు ఆర్‌బీఐ జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నిబంధనలను సక్రమంగా పాటించని కారణంగా కర్నాటక బ్యాంక్‌కు ఆర్‌బీఐ ఏకంగా నాలుగు కోట్ల రూపాయల జరిమానా విధించింది. పాలనాపరమైన నియంత్రణ కోసం ప్రవేశపెట్టిన నిబంధనల్లో నాలుగింటిని అమలు చేయడంలో కర్నాటక బ్యాంక్ విఫలమైన విషయా న్ని ఆర్‌బీఐ గుర్తించింది. సత్వర చర్య లు తీసుకోకుండా ఎందుకు జాప్యం చేశారని ఆగ్రహించిన ఆర్‌బీఐ నాలు గు కోట్ల రూపాయలు జరిమానా విధించిందని కర్నాటక బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. మేసేజింగ్ సాఫ్ట్‌వేర్‌ను సక్రమంగా వినియోగించకపోవడమే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో సుమారు 14,000 కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి ఒకానొక కారణమని నిపుణులు అంటున్నారు. అందుకే, పాలనాపరమైన అంశాల్లో, ప్రత్యేకించి మేసేజింగ్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావు ఉండరాదని ఆర్‌బీఐ ఇది వ రకే ప్రభుత్వ, ప్రభుత్వ రంగ బ్యాంకులను హెచ్చరించింది. నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యల తప్పవని కూడా స్పష్టం చేసింది. అయితే, కర్నాటక బ్యాంక్ ఈ నిబంధనలను శీఘ్రగతిన అమలు చేయనందున జరిమానా విధించింది. కాగా, ఇదే కారణంగా గతంలో యూనియన్ బ్యాంక్‌కు మూడు కోట్లు, దేనా బ్యాంక్‌కు రెండు కోట్లు, ఐడీబీఐ, ఎస్‌బీఐలకు ఒక్కో కోటి రూపాయలు చొప్పున ఆర్‌బీఐ జరిమానా విధించింది.