బిజినెస్

అలహాబాద్, ఐసీఐసీఐ బ్యాంకులపై ఆర్‌బీఐ కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ, మార్చి 5: నిబంథనలను అమలు చేయని అలహాబాద్ బ్యాంక్ తీరుపై భారతీయ రిజర్వుబ్యాంక్ (ఆర్‌బీఐ) మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ప్రత్యేకించి నోస్ట్రో ఖాతాలపై ఇచ్చిన సూచనలను అమలు చేయకపోవడంపై ఆర్బీఐ మండిపడింది. ఒక బ్యాంకు తన విదేశీ కరెన్సీని మరో బ్యాంకులో మదుపు చేయడానికి ఏర్పాటుచేసే ఖాతాను నోస్ట్రో ఖాతా అంటారు. కాగా ఐసీఐసీఐ బ్యాంకుకు సైతం ఆర్‌బీఐ సుమారు కోటి రూపాయల జరిమానా విధించింది. గ్లోబల్ మెస్సేజింగ్ సాఫ్ట్‌వేర్ స్విఫ్ట్‌కు సంబంధించి ఇచ్చిన మార్గదర్శకాలను అమలుచేయడంలో జాప్యం చేయడంతో ఐసీఐసీఐ బ్యాంక్ ఈ శిక్షను ఎదుర్కొంది. 2018 ఫిబ్రవరి 20న అలహాబాద్ బ్యాంక్‌కు కొన్ని మార్గదర్శకాలను పంపుతూ వాస్తవిక దృక్పథంతో వెనువెంటనే నాస్ట్రో ఖాతాలను పునర్‌వ్యవస్థీకరించాలని ఆదేశించడం జరిగింది. అంటే టీ ప్లస్ వన్ విధానంతో నాస్ట్రో అప్పులు, టీ ప్లస్ 5 పద్ధతిలో నాస్ట్రో పొదుపు ఖాతాలను నిర్వహించాల్సిందిగా ఆర్‌బీఐ ఆదేశించినా అది అమలుకు జరగలేదు. అలాగే స్విఫ్ట్‌కు సంబంధించిన నియంత్రణలను మరింతగా బలోపేతం చేస్తూ నిర్ణీత కాలవ్యవధిలోగా అమలు చేయాలంటూ ఐసీఐసీఐ బ్యాంకును ఆదేశించినా అములు చేయలేదన్నది ఆర్‌బీఐ అభియోగం. ఐతే మంగళవారం స్టాక్ మార్కెట్‌లో ఈ ప్రభావం స్టాక్‌మార్కెట్లలో కనిపించకపోవడం గమనార్హ. అలహాబాద్ బ్యాంక్ వాటాలు 4.10 శాతం అధికంగానూ, ఐసీఐసీఐ బ్యాంకు వాటాలు 2.53 శాతం అధికంగానూ ట్రేడయ్యాయి.