బిజినెస్

ఆన్‌లైన్ గేమింగ్ ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 7: డిజిటల్ రంగంలో వౌలిక సదుపాయాలు విస్తరించడంతో మనదేశంలో ఆన్‌లైన్ గేమింగ్ గణనీయమైన ప్రగతిని సంతరించుకుంది. దీని ద్వారా దేశ ఆదాయం వచ్చే 2023 నాటికి 11,900 కోట్ల రూపాయలకు పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ రంగ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ ద్వారా 2014లో సుమారు రూ.2000 కోట్ల ఆదాయం రాగా అది 2018లో ద్విగుణీకృతమై రూ.4,400 కోట్లకు చేరింది. 2023 నాటికి ఇది మరో 22 శాతం పెరిగే అవకాలున్నాయని కేపీఎంజీ అనే అధ్యయన సంస్థ నివేదిక వెల్లడించింది. గేమర్లు, గేమ్ డెవలప్‌మెంట్ కంపెనీల సంఖ్య 2018లో 250 మిలియన్లకు చేరింది. 2010లో ఈ సంఖ్య కేవలం 20 మిలియన్లుండగా ఎనిమిదేళ్ల కాలంలో ఈ రంగం అన్యూహ్యంగా అభివృద్ధిని సంతరించుకుంది. 2017లో మొబైల్ ఫోన్లతో కలిపి మనదేశ ప్రధాన ఆదాయాల్లో 85శాతం వ్యాపార వా టాను ఈ రంగం ఆక్రమించింది. ప్రధానంగా స్మార్ట్ఫోన్ల వాడకం పెరగడం, పెనట్రేషన్ ద్వారా ఇంటర్నెట్ వాడకం గణనీయంగా పెరిగింది. డేటా ధరలను తగ్గించడం కూడా మొబైల్ గేమింగ్ విస్తరణకు ఊతమిచ్చింది. పజిల్, యాక్షన్, సాహసం, ఫాంటసీ, స్పోర్ట్స్‌కు సంబంధించిన గేమ్‌లకు కూడా గణనీయంగా ఆదరణ లభించిందని అధ్యయన నివేదిక వెల్లడించింది. కొత్త స్పోర్ట్స్ లీగ్‌లు రావడంతోబాటు, డిజిటల్ రంగంలో వౌలిక వసతులు విస్తరించడంతో ఆన్‌లైన్ గేమింగ్ పెద్దయెత్తున విస్తరించిందని నివేదిక తెలిపింది. సుమారు 74 శాతం మంది వినియోగదారులు ఎక్కువగా ఫాంటసీ గేమ్‌లు ఆడటానికే ఆష్టపడుతున్నారని, అలాగే వారంలో ఒకసారి నుంచి మూడుసార్లు క్రీడలకు సంబంధించిన గేమ్స్ ఆడుతున్నారని నివేదిక తెలిపింది.