బిజినెస్

బంగారం ధర పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 7: బులియన్ మార్కెట్‌కు గురువారం ఎవరూ ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. అటు విదేవీ పెట్టుబడిదారులు, ఇటు దేశీయ మదుపరులు కూడా నిరాసక్తంగా వ్యవహరించడంతో, బులియన్ మార్కెట్‌కు నష్టాలు తప్పలేదు. పది గ్రాముల బంగారం 360 రూపాయలు, కిలో వెండి 520 రూపాయలు చొప్పున నష్టపోయాయి. బులియన్ మార్కెట్‌లో లావాదేవీలు మొదలైన మరుక్షణం నుంచే సూచీ పతనం మొదలైంది. మదుపరులతోపాటు, దేశీయ జ్యుయెలరీ వ్యాపారుల నుంచి కూడా డిమాండ్ లేకపోవడంతో, ధర పతనం కొనసాగుతునే వచ్చింది. ధర 33,450 రూపాయలుగా ఉన్న సమయంలో కొంత సేపు ట్రేడింగ్ స్థిరంగా కొనసాగింది. దీనితో ఇదే ధర వద్ద ట్రేడింగ్ ముగుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, చివరి క్షణాల్లో మళ్లీ పతనం తప్పకపోవడంతో, చివరికి 33,070 రూపాయలుగా నమోదైంది. వెండి కూడా 39,500 రూపాయల వద్ద కొద్ది సేపు స్థిరపడింది. కానీ, బంగారం మాదిరిగానే వెండికి కూడా చివరిలో మరోసారి పతనం తప్పలేదు. మొత్తం మీద ఎప్పుడూ లాభాలను ఆర్జించే బులియన్ మార్కెట్ గురువారం మాత్రం ఎవరూ ఊహించని రీతిలో నష్టపోయింది.