సబ్ ఫీచర్

ఎడం అవసరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిడ్డకీ, బిడ్డకీ మధ్య ఎడం ఉండాలనే విషయం అందరికీ తెలిసిందే.. కానీ కొంతమంది తల్లులకు గర్భధారణ జరిగిన కొద్దిరోజులకే గర్భం పోతుంది. అలాంటి మహిళలకు తిరిగి గర్భం ధరించడానికి కొంత సమయాన్ని తీసుకోమని చెబుతారు డాక్టర్లు. కానీ మృత శిశువును ప్రసవించిన తర్వాత మళ్లీ గర్భం దాల్చడానికి ఆలస్యం చేయాల్సిన అవసరం లేదని ఓ అధ్యయనంలో తేలింది. గర్భానికి 24 వారాల వయసు పూర్తయ్యాక ప్రాణం లేకుండా పుట్టిన బిడ్డను మృత శిశువు అంటారు. 24 వారాల వయసు పూర్తవ్వకుండా గర్భంలోనే శిశువు మరణిస్తే దాన్ని అబార్షన్ అంటారు. కొందరు గర్భవతుల్లో ఆరోగ్య సమస్యలు, మాయ లేదా ప్లేసెంటా సమస్యలు కూడా మృత శిశు జననాలకు దారితీస్తాయి. మరికొందరు మహిళల్లో ఇలాంటి జననాలకు ఎలాంటి కారణాలు కనిపించవు. ఏది ఏమైనా మృతశిశువును ప్రసవించాక మళ్లీ గర్భం దాల్చడానికి సంవత్సరకాలం ఆగాలని సాధారణంగా వైద్యులు చెబుతారు. కొన్ని ఆధారాలు కూడా ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. కానీ 14 వేల మందిపై జరిగిన ఓ అంతర్జాతీయ అధ్యయనంలో సంవత్సరం కంటే ముందు గర్భం దాల్చినా ఇబ్బంది లేదని తేలింది. ఈ అధ్యయనం ఫలితాలు చాలా ప్రధానమని, దీని ఫలితాలు ఓ భరోసా ఇస్తున్నాయని ఇంగ్లండుకు చెందిన నిపుణులు అంటున్నారు.
ఇంగ్లండులోని ప్రతి 225 ప్రసవాల్లో ఒక మృత శిశువు నమోదవుతోంది. అంటే 24 వారాల వయసులో శిశువు మరణిస్తోందని విశే్లషించుకోవచ్చు. 2000 సంవత్సరం నుంచి ఇంగ్లండ్‌లో మృత శిశు మరణాలు చాలావరకూ తగ్గాయి. 2015 నుంచి అయితే గణనీయంగా తగ్గాయి. కానీ ఇతర ఐరోపా దేశాలతో పోల్చుకుంటే ఇంగ్లండ్ ఇంకా వెనుకబడే ఉంది. చాలా దేశాల్లో మృత శిశువు జన్మించాక, మళ్లీ గర్భం దాల్చడానికి సరైన మార్గదర్శకాలు పరిమితంగానే ఉన్నాయని ఈ అధ్యయనం తెలిపింది. ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని మాంచెస్టర్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ అలెక్స్ హీజెల్ అంటున్నారు. బిడ్డ మరణించడానికి గల కారణాలు తెలుసుకున్న తర్వాత, మళ్లీ ఎప్పుడు గర్భవతి అవ్వాలన్న ప్రశ్న కంటే, వారు మానసికంగా ఎప్పుడు సిద్ధంగా ఉంటారోనన్నది చాలా అవసరం. ఆ సమయంలో తల్లిపై ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. ఆ ఒత్తిడిని అధిగమించేందుకే కొందరు కాస్త సమయం తీసుకుంటూ ఉండచ్చు అంటారు కొంతమంది డాక్టర్లు.
పశ్చిమ ఆస్ట్రియా, ఫిన్లాండ్, నార్వేలోని 14, 452 మంది మహిళలపై ఈ అధ్యయనం చేశారు. వీరంతా 37 ఏళ్ల వయసు పైబడ్డవారే. వీరందరూ అంతకముందు మృతశిశువుకు జన్మనిచ్చినవారే.. ఈ మహిళలు మళ్లీ ప్రసవించాక పరిశీలిస్తే, వీరిలో కేవలం రెండు శాతం మాత్రమే మృత శిశువులు జన్మించారు. 18 శాతం శిశువులు నెలలు నిండకముందే జన్మించారు. తొమ్మిది శాతం మంది శిశువులు ఉండాల్సిన బరువుకంటే కాస్త తక్కువ బరువుతో జన్మించారు. మృతశిశువును ప్రసవించిన రెండు-మూడు సంవత్సరాల వ్యవధిలో గర్భం దాల్చిన మహిళలతో పోలిస్తే.. కేవలం 12 నెలల వ్యవధిలో గర్భం దాల్చిన మహిళలకు మృత శిశువులు, నెలలు నిండకముందే ప్రసవాలు నమోదు కాలేదని అధ్యయనం గుర్తించింది. ఈ మొత్తం మహిళల్లో 9,109 మంది అంటే.. 63శాతం మంది మహిళలు, మృతశిశువు జననం తర్వాత కేవలం పనె్నండు నెలల వ్యవధిలోనే మళ్లీ గర్భం దాల్చారు. మృత శిశువు జననం తర్వాత మహిళలకు కౌనె్సలింగ్ ఇవ్వడానికి ఈ ఫలితాలు ఉపయోగపడతాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ అనె్నట్టే రీగర్ అన్నారు. ఈమె ఆస్ట్రేలియాలోని కర్టిన్ యూనివర్శిటీకి చెందినవారు. ఒక ప్రసవం నుంచి పూర్తిగా కోలుకోకముందే మరోసారి గర్భం దాల్చే మహిళల్లో పౌష్టికాహార స్థాయిలు తక్కువగా ఉండటంతో, పిండం ఎదుగుదలపై దాని ప్రభావం పడుతుందని, దీంతో పాటు ప్రసవ సమయంలో సమస్యలు తలెత్తుతాయని డా. రీగాన్ చెబుతున్నారు. కానీ ఈ కారణాలేవీ.. అబార్షన్లకు, మృతశిశువు జన్మించడానికి దారి తీయవని వివరించారు.
ఈ అధ్యయనం గురించి మాట్లాడుతూ ఇందులో గమనించాల్సిన అంశాలు మరికొన్ని ఉన్నాయని అమెరికాకు చెందిన డా. మార్క్ ఎ క్లెబనాఫ్ అన్నారు. అన్నింటికీ మించి వైద్యులు.. మృత శిశువును ప్రసవించిన మహిళ మానసిక స్థితి గురించి ఆలోచించాలి. ఆమె వయసు, పిల్లల పట్ల ఆమె ఆసక్తి, కుటుంబ పరిస్థితులు.. అన్నిటికీ మించి.. ఓ శిశువును కోల్పోయిన తర్వాత, మళ్లీ గర్భం దాల్చడానికి ఆమె మానసికంగా సిద్ధంగా ఉన్నారా? .. ఇలా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి అన్నారు.