బిజినెస్

కొనసాగుతున్న బుల్ రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 13: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో బుల్ ర్యాలీ కొనసాగుతున్నది. వరుసగా మూడో రోజు కూడా స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జించింది. సెనె్సక్స్ 216.51 పాయింట్లు (0.58 శాతం) పెరగడంతో, 37,752.17 పాయింట్ల వద్ద ముగిసింది. అదే విధంగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 40.50 పాయింట్లు (0.36 శాతం) పెరి, 11,341.70 పాయింట్లుగా నమోదైంది. స్టాక్ మార్కెట్‌పై మదుపరులు ఆసక్తిని ప్రదర్శించడం, అంతర్జాతీయ సూచీలు కూడా సానుకూలంగా స్పందించడం వంటి అంశాలు సెనె్సక్స్‌కు లాభాలను ఆర్జించి పెట్టాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు అత్యధికంగా 4.15 శాతం లాభాలను ఆర్జించడం విశేషం. ఎస్ బ్యాంక్ 3.67 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.63 శాతం, హెచ్‌డీఫ్‌సీ బ్యాంక్ 2.56 శాతం, ఎస్‌బీఐ 2.15 శాతం చొప్పున లాభాలను సంపాదించాయి. అయితే, స్టాక్ మార్కెట్‌లో సానుకూల పరిస్థితులో ఉన్నప్పటికీ, భారతీ ఎయిర్‌టెల్ ఎవరూ ఊహించని విధంగా భారీ నష్టాలను చవిచూసింది. ఆ సంస్థ షేర్ల ధర 4.08 శాతం పతనమైంది. వేదాంత (3.48 శాతం), సన్ ఫార్మా (2.98 శాతం), టాటా స్టీల్ (2.01 శాతం), కోల్ ఇండియా (1.73 శాతం) కూడా బీఎస్‌ఈలో బుధవారం నష్టాలను ఎదుర్కొన్నాయి. జాతీయ మార్కెట్‌లోనూ ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ కావడం విశేషం. 4.32 శాతంతో ఈ బ్యాంక్ షేర్లు లాభపడిన సంస్థల జాబితాలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఎస్ బ్యాంక్ 3.56 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.87 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.67 శాతం, ఎస్‌బీఐ 2.42 శాతం చొప్పున లాభాలను ఆర్జించాయి. ఎన్‌ఎస్‌ఈలోనూ భారతీ ఎయిర్‌టెల్‌కు నష్టాలు తప్పలేదు. ఆ సంస్థ షేర్లు 4.28 శాతం పతనమయ్యాయి. ఐఓసీ (3.67 శాతం), జీ ఎంటర్‌టైనె్మంట్ (3.41 శాతం), సన్ ఫార్మా (3.13 శాతం), వేదాంత (2.60 శాతం) సంస్థలకు కూడా నష్టాలు తప్పలేదు.
భారత స్టాక్ మార్కెట్‌లో బుధవారం నాటి లావాదేవీలకు సంబంధించిన గణాంకాలను అనుసరించి, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 2,477.72 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. రూపాయి మారకపు విలువ మరింత బలపడిన నేపథ్యంలో, భారత స్టాక్ మార్కెట్‌పై విదేశీ మదుపరులు ఆసక్తిని ప్రదర్శించారు. దేశంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు తెరపడగా, పాకిస్తాన్‌తో యుద్ధ భయం ప్రస్తుతానికి లేదని స్పష్టం కావడంతో, స్టాక్ మార్కెట్ బలాన్ని పుంజుకుంది. ఫలితంగా వరుసగా మూడో రోజు కూడా లాభాలను సంపాదించింది.