బిజినెస్

బంగారం వెలవెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 15: బులియన్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం వెలవెలపోయింది. అటు దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు, ఇటు నగల వ్యాపారులు అంతగా ఆసక్తిని ప్రదర్శించకపోవడంతో, 10 గ్రాముల బంగారం ఏకంగా 260 రూపాయలు పతనమై, 33,110 రూపాయలకు చేరింది. కిలో వెండి కూడా 130 రూపాయలు తగ్గి, 39,170 రూపాయల వద్ద ముగిసింది. మార్కెట్‌లో లావాదేవీలతోపాటు ధరల పతనం కూడా మొదలైంది. మధ్యాహ్నం పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశాలు కనిపించినప్పటికీ, ఆతర్వాత వెంటనే తిరిగి పతనం కొనసాగింది. చివరి గంటలో ఒక్కసారిగా మార్పు వస్తుందని ఊహించిన బ్రోకర్లు, పెట్టుబడిదారులకు నిరాశే మిగింది. నిరాటంకమైన పతనంతో నష్టాలను చవిచూసింది.