బిజినెస్

ద్విచక్ర వాహనాల ఉత్పత్తి ఆశాజనకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 15: దేశంలో ద్విచక్ర వాహనాల ఉత్పత్తి ఆశాజనకంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఈ ఆర్థిక సంవత్సరంలో, ఫిబ్రవరి ముగిసే నాటికే ఉత్పత్తి దాదాపుగా లక్ష్యాలను చేరుతున్నది. మోటార్ సైకిళ్ల విషయానికి వస్తే, 2018లో 10,53,596 వాహనాలు ఉత్పత్తికాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఈ సంఖ్య చాలా స్వల్ప తేడాతో వెనుకబడి ఉంది. 10,47,486 వాహనాలు ఉత్పత్తి అయ్యాయి. ఈ మాసం ముగిసే సమయానికి ఉత్పత్తి మరింతగా పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద మోటార్ సైకిళ్ల ఉత్పత్తి 2018లో 12,78,699కాగా, ఈ ఏడాది 12,79,654 వాహనాలు. ఎగుమతులు గత ఏడాది 2,25,755కాగా, ఈ ఏడాది 2,38,448 వాహనాలు. కాగా, గత ఏడాది 6,13,797 స్కూటర్లు ఉత్పత్తి అయ్యాయి. ఈ సంఖ్య 5,83,451 స్కూటర్లు, ఎగుమతులు గత ఏడాది 28,629కాగా, ఈ ఏడాది 30,031 వాహనాలు. మొత్తం కలిపితే, గత ఏడాది 5,60,653గా నమోదైన స్కూటర్ల సంఖ్య ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 4,92,584కు పెరిగింది.