బిజినెస్

రూ. 750 కోట్ల అత్యవసర సాయం అందించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 16: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జెట్ ఎయిర్‌వేస్ చైర్మన్ నరేష్ గోయల్ తన విదేశీ భాగస్వామి ‘ఇతిహాద్’ నుంచి రూ.750 కోట్ల నిధుల అత్యవసర సాయాన్ని అర్ధించారు. సుదీర్ఘ ద్రవ్యలోటు కారణంగా సంస్థలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని గోయల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ సంస్థకు చెందిన దాదాపు 50 విమానాల రాకపోకలు ఆగిపోయిన నేపథ్యంలో పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని గల్ఫ్‌లోని ఇతిహాద్ సంస్థకు చెందిన సీఈవో టోనీ డగ్లస్‌కు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సంస్థకు చెందిన వాటాలు జెట్ ప్రివిలేజ్‌లో తాకట్టు పెట్టుకునేందుకు కేంద్ర పౌర విమానయాన సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఈమేరకు కొంత మధ్యంతర నిధి సమకూరే అవకాశాలున్నాయని తెలిపారు. తమ సంస్థకు 49.9 శాతం వాటాలుండగా మిగిలిన మెజారిటీ వాటాలు ఇతిహాద్‌కే ఉన్నాయని గోయల్ తెలిపారు. సోమవారం ఆ సంస్థకు చెందిన బోర్డు సమావేశం దుబాయ్‌లో జరిగిన దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రూ.750 కోట్లు అత్యవసర నిధి అవసరం జెట్ ఎయిర్‌వేస్‌కు ఉం దన్నారు. వచ్చే వారంలోగా ఈ నిధి అందితే బ్యాంకులూ తమవంతు రుణ సాయా న్ని అందజేస్తాయని గోయల్ పేర్కొన్నారు. ఒకవేళ సత్వరం ఈ నిధి అందకపోతే సంస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.