బిజినెస్

ఆర్సిల్ కంపెనీలో ఎవెన్యూ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 22: ఎసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్ (ఆర్సిల్)లో ఎవెన్యూ ఇండియా రిసర్జెన్స్ కంపెనీ పెట్టుబడులు పెట్టి, భాగస్వామిగా మారింది. న్యూయార్క్‌లో కేంద్ర కార్యాలయం ఉన్న అవెన్యూ గ్రూప్‌లో ఒక భాగమైన ఎవెన్యూ ఇండియా రిసర్జెన్స్ కంపెనీ కొంత మంది వ్యక్తులు లేదా సంస్థల నుంచి ఆర్సిల్ వాటాలను కొనుగోలు చేసింది. అయితే, ఎంత శాతం మేర, ఎంత మొత్తానికి వాటాలను కొన్నదనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. మరికొన్ని షేర్లను కూడా కొనేందుకు ఎవెన్యూ ప్రయత్నిస్తున్నదని, ఈ ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తవుతుందని ఆర్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇలావుంటే, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి 8.37 శాతం, దక్షిణాఫ్రికాకు చెందిన ఫిస్ట్రాండ్ బ్యాంక్ నుంచి 4.11 శాతం, సింగపూర్ ప్రభుత్వ సంస్థ లాథే ఇనె్వస్ట్‌మెంట్స్ నుంచి 9.9 శాతం, ఆష్మోర్ క్యాపిటల్ నుంచి 1.37 శాతం, కరూర్ వైశ్య బ్యాంక్ నుంచి 1.96 శాతం, బార్క్‌లేస్ బ్యాంక్ నుంచి 1.5 శాతం చొప్పున వాటాలను ఎవెన్యూ కొన్నట్టు సమాచారం. సెకండరీ పర్చేజెస్ విధానంలో ఈ పెట్టుబడుల ప్రక్రియను ఎవెన్యూ పూర్తి చేసింది. ఇంకా ఎవరెవరు, ఎంత మొత్తంలో ఆర్సిల్ షేర్లను ఈ కంపెనీకి అమ్ముతారనేది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఈ విషయాన్ని రెం డు కంపెనీలు రహస్యంగా ఉంచాయ.