బిజినెస్

క్రిప్టో కరెన్సీ మార్కెట్లో ఒడిదుడుకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్, మార్చి 27: బిట్ కాయిన్స్ ధరల్లో చోటుచేసుకున్న ఒడిదుడుకుల వల్ల క్రిప్టోకాయిన్స్ మైనింగ్ చిప్స్‌పై మార్కెట్లోకి వెళ్లాలనుకున్న ఆలోచనలను వదులుకున్నట్లు బిట్‌మైన్ టెక్నాలజీస్ పే ర్కొంది. ఐపీవోల జారీ ప్రతిపాదనలకు స్వస్తి చెప్పినట్లు ఆ సంస్థ పేర్కొంది. క్రిప్టో కాయిన్స్ మైనింగ్ చిప్స్ ఐపీవోల ద్వారా 3 బిలియన్ అమెరికన్ డాలర్లను సేకరించాలన్న లక్ష్యంతో ఈ సంస్థ ప్రణాళిక ను ఖరారు చేసింది. కాని మార్కెట్ హెచ్చుతగ్గులను చూసి ఈ ప్రతిపాదనలను విరమించుకుంటున్నట్లు పేర్కొంది. వాస్తవానికి క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైనా ఇండస్ట్రీకి మంచి ఉజ్వల భవిష్యత్తు ఉందని, కాని ఈ పరిశమ్ర ఇంకా ఎదగాల్సి ఉందని, తన విలువను చాటుకోవాల్సి ఉందని ఆ సంస్థ తెలిపిం ది. బీజింగ్‌కు చెందిన ఈ సంస్థ బ్లాగ్‌లో ఈ వివరాలను పేర్కొంది.
2018 డిసెంబర్ నాటికి మార్కెట్లో ఒడిదుడుకులు నెలకొన్నాయి. ఈ సమస్యలను 2019లో అధ్యయనం చేస్తామని ఆ సంస్థ పేర్కొం ది. బిట్‌కాయిన్ 2017లో మంచి స్థాయికి ఎదింది. 19500 అమెరికన్ డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత యూనిట్‌కు 3980 డాలర్లకు పతనమైంది. ఆ తర్వా త నిరంతరం మార్కెట్లో ఒడిదుడుకులకు లోనైంది. అందులో ఈ మైనింగ్ ఆపరేషన్స్‌ను ఈ దశలో ప్రారంభిస్తే చతికితలపడుతామని బిట్‌మైన్ టెక్నాలజీస్ పేర్కొంది.