బిజినెస్

టాటా ట్రస్టుల నుంచి తప్పుకున్న సూనావాలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 27: టాటా ట్రస్టు గ్రూపుల నుంచి ఎన్‌ఏ సూనావాలా అనారోగ్య కారణాల వల్ల తప్పుకున్నారు. ఈ మేరకు ట్రస్టు గ్రూపు ఒక ప్రకటన విడుదల చేస్తూ సర్ దోరబ్జీ టాటా ట్రస్టు, సర్ రతన్ టాటా ట్రస్టుల నుంచి సూనావాలా (83) అనారోగ్య, వయోభారం కారణంగా తప్పుకుంటున్నారని ప్రకటించింది. టాటా గ్రూపులో టాటా సన్స్ వైస్‌చైర్మన్‌తో పాటు పలు పదవులు నిర్వహించి రతన్ టాటాకు అత్యంత విశ్వాసపాత్రుడిగా, గురువుగా పనిచేసిన ఆయన అనారోగ్య కారణాల వల్ల తాను రిటైర్ కావాలనుకుంటున్నట్టు తెలిపారని సంస్థ తన ప్రకటనలో పేర్కొంది.