బిజినెస్

ఎల్‌అండ్‌టీ మరో ఘనత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 27: వౌలిక సదుపాయాల రంగంలో జెయింట్‌గా పేరొందిన ఎల్‌అండ్‌టి మరో ఘనతను సాధించింది. దేశంలోనే అతిపెద్దదైన బాహుబలి లాంటి హైడ్రో క్రేకర్‌ను తయారు చేసి విశాఖలోని హెచ్‌పీసిఎల్ రిఫైనరీకి తరలించినట్టు ప్రకటించింది. ఈ హైడ్రోక్రేకర్ బరువు 1,858 టన్నులు. అంతేకాకుండా ప్రస్తుతం ఎల్ అండ్ టీ రెండు వేల టన్నుల కంటే బరువైన పలు హైడ్రోక్రేకర్ రియాక్టర్లను తయారు చేస్తోంది. ఇవి కనుక పూర్తయితే అంతర్జాతీయ స్థాయిలో కంపెనీ మరో మైలురాయిని చేరినట్టవుతుందని ఆ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంజనీరింగ్ పరికరాల తయారీలో భారత్‌లో ఈ ఘనత సాధించిన మొదటి సంస్థ తమదేనని పేర్కొంది. విశాఖలోని హెచ్‌పీసీఎల్ రిఫైనరీ ఆధునీకరణలో భాగంగా దానికి అవసరమైన 1,858 టన్నుల హైడ్రో క్రేకర్‌ను గుజరాత్‌లోని హజిరాలో ఉన్న తమ ప్లాంట్‌లో తయారు చేసినట్టు కంపెనీ తెలియజేసింది. కాగా, భారత్‌లో అతి బరువైన బాహుబలి హైడ్రో క్రాకర్ తయారు చేయడానికి తాము ఎల్ అండ్ టీ సహకారం తీసుకోవడం గర్వకారణంగా భావిస్తున్నామని హెచ్‌పీసీఎల్ రిఫైనరీ ఆధునికీరణ ప్రాజెక్టు ఈడీ ఎస్.రాజా తెలిపారు. ఇంత భారీ ఇంజనీరింగ్ పరికరాన్ని తయారు చేయడానికి తమకు అవకాశం ఇచ్చిన హెచ్‌పీసీఎల్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు ఎల్ అండ్ టీ హెవీ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. టెక్నాలజీ, ఇంజనీరింగ్, నిర్మాణం, తయారీ, ఆర్థిక సేవల రంగాల్లో ఉన్న బహుళజాతి కంపెనీ అయిన ఎల్ అండ్ టీ 18 బిలియన్ల యూఎస్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది.