బిజినెస్

సెన్సెక్స్ పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 27: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో బుధవారం ప్రతికూల పరిస్థితుల్లో ట్రేడింగ్ కొనసాగింది. ఫలితంగా, లావాదేవీలు ముగిసే సమయానికి సెనె్సక్స్ 100.53 పాయింట్లు పతనమై, 38,132.88 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ కూడా 38.20 పాయింట్లు కోల్పోయి, 11,445.05 పాయింట్లకు పడిపోయింది. ఉదయం మార్కెట్ మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ పరిణామాలతోపాటు, ప్రధాని నరేంద్ర మోదీ అంతరిక్ష శక్తిపై జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం కూడా స్టాక్ మార్కెట్‌పై కొంత ప్రభావం చూపింది. లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సెనె్సక్స్ చివరికి నష్టాల్లోనే ముగియగా, ఎన్‌టీపీసీ షేర్లు అత్యధికంగా 2.25 శాతం దిగజారాయి. టాటా మోటార్స్ 1.85 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 1.49, పదవర్‌గ్రిడ్ 1.36 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 1.30 శాతం చొప్పున నష్టాలను చవిచూశాయి. అదే విధంగా రిలయన్స్ (1.25 శాతం), హీరో మోటోకార్ప్(1.21 శాతం), మహీంద్ర అండ్ మహీంద్ర (1.14 శాతం), సన్ ఫార్మా (1.10 శాతం), ఏషియన్ పెయింట్స్ (0.97 శాతం) కూడా నష్టాలను ఎదుర్కొన్న కంపెనీల్లో ఉన్నాయి. కాగా, ప్రతికూల పరిస్థితులను సైతం సమర్థంగా ఎదుర్కొన్న ఏస్ బ్యాంక్ షేర్లు 5.62 శాతం లాభాలను ఆర్జించాయి. ఇండస్‌ఇండ్ 5.27 శాతంతో ఎస్ బ్యాంక్‌కు చివరి వరకూ పోటీనిచ్చింది. ఎస్‌బీఐ 1.57 శాతం, బజాజ్ ఆటో 1.18 శాతం, వేదాంత 1.12 శాతం చొప్పున లాభాలను సంపాదించాయి. కాగా, ఎన్‌ఎస్‌ఈలోనూ ఎస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ భారీ లాభాలను నమోదు చేశాయి. ఎస్ బ్యాంక్ షేర్లు 5.81 శాతం, ఇండస్‌ఇండ్ షేర్లు 5.23 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇండియా బుల్స్ 2.84, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 2.19 శాతం, ఎస్‌బీఐ 1.75 శాతం చొప్పున లాభపడ్డాయి. కాగా, నష్టాలను చవిచూసిన కంపెనీల జాబితాలో హెచ్‌పీసీఎల్ (2.83 శాతం), ఎన్‌టీపీసీ (2.70 శాతం) మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి. ఇచర్ 1.91 శాతం, టాటా మోటార్స్ 1.88 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 1.62 శాతం చొప్పున లాభాలను సంపాదించాయి.