బిజినెస్

కొత్తగా బార్జ్ టర్మినల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 28: రాష్ట్రంలోని హుగ్లీ జిల్లాలో బార్జ్ టర్మినల్‌ను నెలకొల్పాలని కోల్‌కతా పోర్టు ట్రస్టు నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు విలువ రూ.300 కోట్లు. ఈ వివరాలను పోర్టు ట్రస్టు చైర్మన్ వినీత్ కుమార్ చెప్పారు. కోల్‌కతాలో రద్దీని తగ్గించేందుకు బార్జ్ టర్మినల్‌ను బాలాగడ్‌లో నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఏడాదిసెప్టెంబర్ నుంచి నిర్మాణం పనులు చేపడుతామన్నారు. 300 ఎకరాల భూమిలో ఈ టర్మినల్‌ను నిర్మిస్తారు. కోల్‌కతా పోర్టులో 9 శాతం చొప్పున పోర్టు కార్యకలాపాలు వృద్ధి చెందుతున్నాయి. దేశంలో 12 మేజర్ పోర్టుల్లో కోల్‌కొతా ఒకటి. గత ఏడాది 58 మిలియన్ టన్నుల కార్గోను ఇక్కడి నుంచి ఎగుమతులు చేశారు. కాగా ఈ ఏడాది ఇంతవరకు 62 మిలియన్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేశామన్నారు. స్టీల్ ఇండస్ట్రీ కార్యకలాపాలు పెరగడంతో కార్గో పెరిగినట్లు ఆయన చెప్పారు. ఇంకా ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ కార్గో కార్యకలాపాలు పెరగనున్నట్లు ఆయన చెప్పారు.