బిజినెస్

త్వరలోనే పీఎఫ్‌సీ, రూరల్ ఎలక్ట్రికల్ డీల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 28: పపర్ ఫైనాన్స్ కార్పోరేషన్, రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్‌ల మధ్య త్వరలోనే డీల్ ఖరారవుతుందని, ఈ రెండుసంస్థలు నిలకడతో వృద్ధిరేటును కొనసాగిస్తున్నాయని గ్లోబల్‌రేటింగ్ ఏజన్సీ మూడీస్ పేర్కొంది. ప్రభుత్వ ఆధీనంలో ఆర్‌ఈసీలోని 52.63 శాతం వాటాలను రూ.14500 కోట్లతో టేకోవర్ చేయాలని పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ సంస్థ పేర్కొంది. అన్నిరకాల అనుమతులు వచ్చిన వెంటనే డీల్ ఖరారవుతుందని పేర్కొన్నారు. ఈ నెల లోపలే టేకోవర్ జరగవచ్చని కూడా పీఎఫ్‌సీ వర్గాలు తెలిపాయి. గత ఏడాది డిసెంబర్ 13 నుంచి ఈ రెండు సంస్థల పనితీరును మదింపు ప్రారంభమైంది. ఈక్విటీని పెంచకుండా తన నిధులను మొత్తం ప్రభుత్వ ఆధీనంలోని ఆర్‌ఈసీలో పెట్టడం, టేకోవర్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ టేకోవర్ పీఎఫ్‌సీ పెట్టుబడులను బలహీనపరుస్తాయనే వాదన ఉంది. ఈ టేకోవర్ పూర్తయిన తర్వాత పీఎఫ్‌సీ ప్రాధాన్యత పెరుగుతుందంటున్నారు. పీఎఫ్‌సీ వ్యూహాత్మక విధానాలను అవలంభిస్తోంది. కాగా ఈ టేకోవర్ వల్ల పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్‌కు ప్రభుత్వం వెనుదన్నుగా నిలబడనుంది. పీఎఫ్‌సీ పరపడి పెరగనుందని మూడీస్ నివేదికలో పేర్కొంది. బేస్‌లైన్ క్రెడిట్ అసెస్‌మెంట్ రేటింగ్ కూడా పెరగనుంది. ఈ టేకోవర్ పూర్తయితే, ఇక ప్రభుత్వ పరిధి నుంచి ఆర్‌ఈసీ చేజారుతుంది. కాని పీఎఫ్‌సీ ద్వారా మాత్రమే ఆర్‌ఈసీని ప్రభుత్వ నియంత్రించేందుకు అవకాశం ఉంది.