బిజినెస్

బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.5,042 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: దేనా, విజయా బ్యాంకులను విలీనం చేసుకోనున్న బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) మూలధన అభివృద్ధి నిమిత్తం రూ. 5,042 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ మూడు బ్యాంకుల విలీనం అమలులోకి వస్తున్న క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 5,042 కోట్ల రూపాయలను బ్యాంకు ఆర్థికాభివృద్ధికి అందజేస్తున్నట్టు తెలియజేసిందని గురువారం బీఓబీ తన రెగులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ప్రాధాన్యతా విధానంతో ఈక్విటీ షేర్ల (ప్రత్యేక సెక్యూరిటీలు, బాండ్ల) కేటాయింపు ద్వారా ప్రభుత్వ పెట్టబడి రూపంలో ఈ నిధుల నింపుదల జరుగుతుందని బ్యాంకు వివరించింది.
కాగా విలీన పథకం ద్వారా విజయాబ్యాంకుకు చెందిన వాటాదారులకు ప్రతి వెయ్యి వాటాల్లో 402 ఈక్విటీ షేర్లు బ్యాంక్ ఆఫ్ బరోడాలో లభిస్తాయి. అలాగే దేనాబ్యాంకుకు చెందిన వాటాదారులు బీఐబీలోని ప్రతి వెయ్యి వాటాల్లో 110 వాటాలు దక్కించుకుంటారు. గత సెప్టెంబర్‌లో ఈ మూడు బ్యాంకుల విలీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల తర్వాత అతిపెద్ద బ్యాంకుగా ఈ వీలీన బ్యాంకు అవతరించనుంది.