బిజినెస్

కోలుకున్న పసిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాములపై రూ.35 పెరిగి మొత్తం ధర 33,095కు చేరింది. వరుసగా రెండు రోజులుపాటు నష్టాలను చవిచూసిన పసిడి ఇప్పుడు కోలుకోవడంతో వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు వారం రోజులు అంతర్జాతీయంగా నెలకొన్న ఒడిదుడుకులతో ఇబ్బందులు ఎదుర్కొన్న బంగారం దేశీయంగా పెరిగిన డిమాండ్‌తో ఎట్టకేలకు నష్టాలను అధిగమించి స్వల్ప లాభాల్లోకి వచ్చింది. అయితే వెండి ధరలు మాత్రం కిలోపై రూ.270 తగ్గి రూ. 38,850కు దిగివచ్చింది. స్ధానిక పారిశ్రామిక వర్గాల నుంచేగాక, నాణేల తయారీ యూనిట్ల నుంచి సైతం డిమాండ్ తగ్గడంతో వెండి ధరలు తగ్గాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే అంతర్జాతీయంగా ఉన్న ప్రతికూలతల వల్లే బంగారం ధరలు స్వల్ప స్థాయి పెరుగుదలకే పరిమితం కావాల్సివచ్చిందని అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,310.78 డాలర్లు పలుకగా, వెండి ధర ఔన్సు 15.32 డాలర్లు పలికింది. అక్కడ బంగారం 0.15 శాతం, వెండి 0.16 శాతం నష్టపోయాయి. కాగా మనదేశ రాజధానిలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాములు రూ.33,095 పలుకగా, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం రూ. 32,925 పలికింది.
కాగా గత రెండు రోజులుగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రూ.160 మేర తగ్గాయి. ఇక సవరం బంగారం ధరల్లో మాత్రం ఎలాంటి హెచ్చుతగ్గులూ లేక రూ.26,400 వద్ద స్థిరంగా ఉన్నాయి. వెండి వార సరఫరా విధానంలో కిలోపై రూ. 281 తగ్గి 38,002 పలికింది. ఐతే వెండి నాణేల ధరల్లో మాత్రం స్థిరత్వం కనిపించింది. అమ్మకాల్లో వంద పీసులు రూ.81వేలు, కొనుగోళ్లలో 80వేల వంతున ధర పలికాయి.