బిజినెస్

ఇండిగో నుంచి వైదొలగిన చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 31: విమాన యాన సంస్థ ఇండిగో అంతర్జాతీయ నిర్వహణ ఇబ్బందుల్లో పడిన దృష్ట్యా దాని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ మైఖేల్ స్వియాటెక్ సంస్థ నుంచి తప్పుకున్నారు. 2018 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఈ సంస్థకు చెందిన అత్యున్నత స్థాయి వ్యక్తులు ఇలా తప్పుకోవడం రెండోసారి. స్వియాటెక్ గత సంవత్సరం ప్రథమార్థంలో ఇండిగో సంస్థలో చేరారు. అప్పటి నుంచి అంతర్జాతీయంగా విమానాల రాకపోకలను మరింతగా పటిష్టవంతం చేసే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. చిల్లియన్ విమానయాన సంస్థ లాటమ్ నుంచి ఆయన గత యేడాది ఫిబ్రవరిలో ఇండిగోకు వచ్చారు. కాగా దీనికి సంబంధించి వివరణ కోసం పీటీఐ సంబంధిత అధికారిని సంప్రదించగా స్వి యాటెక్ ‘వ్యక్తిగత కారణాలతోనే సంస్థ నుంచి రాజీనామా చేశార’ని బదులిచ్చారు. ఇలావుండగా ఈ విమానయాన సంస్థ (ఎయిర్‌పోర్టుల విభా గం)లో ఉపాధ్యక్షుడుగా పనిచేస్తున్న సిండి స్జాడోకియర్క్సీ బోర్డు నుంచి వైదొలగారు. సంస్థకు చెం దిన వాటాలు నాలుగు నెలల నుంచి దేశీయ మార్కెట్లలో నష్టాలు నమోదు చేస్తున్న క్రమంలో ఆయన వైదొలిగినట్టు సమాచారం. ఆయన గత డిసెంబర్‌లో ఈ సంస్థ నుంచి వైదొలగారు. ఐతే కాంట్రాక్టు గడువు ముగిసినందువల్లే వెళ్లిపోయారని ఇండిగో చెప్పుకుంది. ఆయన కూడా దత్తా ఎయిర్‌లైన్స్ నుంచి ఇండిగోకు గత 2018 జనవరిలో వచ్చారు. కాగా పోటీదారైన స్పైస్‌జెట్ విమానాల రాకపోకల్లో మంచి సమయపాలతో ఇండిగోకు సవాల్ వసరి అగ్రస్థానానికి చేరడంతో ఎయిరోడ్రాంలు, విమాన నిర్వహణలో ఇండిగో మరింత దృష్టిపెట్టింది.