బిజినెస్

వడ్డీ రేట్ల కోత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 31: రుణాలపై వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల మేర రిజర్వు బ్యాంకు కోత విధించే అవకాశాలున్నాయి. అంతర్జాతీయంగా ఆర్థికాభివృద్ధిలో నెలకొన్న మందగమన పరిస్థితులతో దేశీయంగా ఏర్పడిన ప్రతికూల పనిస్థితులను చక్కదిద్దేందుకు ఆర్బీఐ వచ్చే గురువారం ఈ వడ్డీ రేట్ల కోత విధింపుచర్యలు చేపట్టే వీలుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా 18 నెలల తర్వాత గత ఫిబ్రవరిలో ఆర్బీఐ రెపో రేట్లలో 25 బేసిస్ పాయింట్ల మేర కోత విధించిన సంగతి తెలిసిందే. ఇలా ఒకదాని తర్వాత మరొకటిగా వస్తున్న రేట్ల కోత ఈ ఎన్నికల సీజన్‌లో మదుపర్లకు ఊరటనిస్తుందని అంటున్నారు. ఆర్బీఐ గవర్నర్ శశికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఏప్రిల్ 4న ముంబయిలో సమావేశమై మూడు రోజులపాటు చర్చించి వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనుంది. ఇది నెలవారీ ద్రవ్య వినిమయ కమిటీ సమావేశాల్లో ఒకటైనప్పటికీ కొత్త ఆర్థిక సంవత్సరం 2019-20లో ఇదే తొలి సమావేశం కానుండటం వల్ల ప్రాధాన్యత సంతరించుకుంది. ఈక్రమంలో ఆర్బీఐ గవర్నర్ దాస్ వాటాదార్లతోనూ, పారిశ్రామిక వర్గాలు, డిపాజిటర్ల సంఘాలతో, మధ్య, చిన్న తరహా ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధులు, బ్యాంకర్లతో సమావేశమై చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకోడం జరిగింది. ఈక్రమంలో ఆర్బీఐ నిర్దేశిత 4 శాతం కన్నా ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటం వల్ల మరో రేట్ల కోత అవసరమని, తద్వారా దేశ ఆర్థికాభివృద్ధి జరుగుతుందని ఆర్థిక రంగ నిపుణుడు, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కేపిటల్ మార్కెట్ స్ట్రేటజీ హెడ్ పీసీజీ వీకే శర్మ అభిప్రాయపడ్డారు. గతంలో ఇచ్చిన 25 శాతం రేట్ల కోతతో దేశీయ మార్కెట్లకు ఊతం లభించిందని, మళ్లీ ద్రవ్య లభ్యతకు దోహదం చేసే రేట్ల కోత చేపట్టడం ద్వారా మార్కెట్ల మనుగడకు,ప్రగతికి మరింతగా దోహదం చేసినట్టు అవుంతుందని ఆయన చెప్పారు. ఆర్బీఐ భవిష్యత్ విధాన నిర్ణయంతో దేశీయ, అంతర్జాతీయ పరిస్థితులను నియంత్రించే వీలుందని కోటక్ మహీంద్రా బ్యాంకు కన్సూమర్ బ్యాంకింగ్ విభాగం అధ్యక్షుడు శాంతి ఏకాంబరం అభిప్రాయపడుతున్నారు. పెట్టుబడుల్లో ఇంకా కొంత మందగమనం సాగుతుండటం వల్ల మినిమయం కొంత వెనకబడి ఉందని ఈక్రమంలో మరో 25 బేసిస్ పాయింట్ల రేట్ల కోత అవసరమని అంటున్నారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకు ద్రవ్యోల్బణం, దేశ వృద్ధిరేటుతోబాటు, రానున్న ఎన్నికల ముందటి బడ్జెట్‌పై, రుతుపవనాలు, ముడిచమురు ధరలపై దృష్టి కేంద్రీకరిస్తుందని అంటున్నారు. 2018-19 ద్వితీయార్ధంలో వృద్ధిరేటులో తగ్గుదల నమోదవడం వల్ల వచ్చే విధాన నిర్ణయంలో రెపో రేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల మేర కోతవిధించి తద్వారా ద్రవ్య వినిమయ విధానంలో సరళీకృత పరిస్థితులను నెలకొల్పాలని సీఎల్‌ఎల్ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ సూచించారు. అలాగే బ్యాంకులు రేట్లకోతను సమర్థంగా అమలు చేయాలంటే ధన నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ను కూడా తగ్గించాల్సిన అవసరం ఉందని బెనర్జీ సూచించారు. దీనివల్ల బ్యాంకులు ధన నిల్వలను రుణాల మంజూరుకు వినియోగించేందుకు వీలుంటుందని ఆయన చెప్పారు. ఇలావుండగా సెంట్రల్ బ్యాంకు నుంచి ఇద్దరికి ప్రాతినిధ్యం ఉన్న ఎంపీసీలో సెంట్రల్ బ్యాంకుకు చెందిన మరో ఇద్దరు ప్రతినిధులు, మరో ముగ్గురు బయటి వ్యక్తులు సభ్యులుగా ఉన్నారు. కాగా రీటెయిల్ ద్రవ్యోల్బణంపై ఎంపీసీ నిర్ణయం తీసుకుంటుంది. అలాగే పారిశ్రామికాభివృద్ధి, అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధిని కూడా విధాన నిర్ణయంలో పరిగణనలోకి వస్తాయి. ప్రత్యేకించి తయారీ రంగంలోని కేపిటల్ అండ్ కన్సూమర్ గూడ్స్ పారిశ్రామిక ఉత్పత్తులు 1.7 శాతానికి తగ్గిపోయేందుకు కారణమయ్యాయని అంచనా. గత జనవరి వరకు ఈ ఉత్పత్తి 7.5 శాతంగా ఉండేది. ఈక్రమంలో గడచిన ఫిబ్రవరి మాసానికి చెందిన పారిశ్రామికాభివృద్ధి సూచీ ఎల్‌ఎమ్‌పీ గణాంకాలు ఇంతవరకు విడుదల కాలేదు.