బిజినెస్

పెరిగిన విమాన ఇంధన, నాన్‌సబ్సిడీ వంట గ్యాస్ ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఆర్థిక ఇక్కట్లలో ఉన్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌కు మరో ధరాఘాతం తగిలింది. విమానాల ఇంధన ధరలు సోమవారం ఒక శాతం అదనంగా పెరిగాయి. దాదాపు నెల రోజుల వ్యవధిలో ఇలా ధరలు పెరగడం ఇది రెండోసారి. అంతర్జాతీయంగా నెలకొన్న ధరల పెరగుదల ప్రభావంతోనే ఈ ధరల పెంపును చేపట్టాల్సి వచ్చిందని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. ఈక్రమంలో దేశ రాజధానిలో ఏవియేషన్ టర్బైనల్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు 1.07 శాతం పెంపుతో కిలోలీటర్‌కు 677.1 రూపాయలు అదనంగా పెరిగింది. దీంతో కిలోలీటర్ ధర రూ. 63,472.22కు చేరిందని ప్రభుత్వ రంగ చమురు సంస్థ విడుదల చేసిన నోటిఫికేషన్ వెల్లడించింది. గత మార్చి 1న ఏకంగా 8.1 శాతం అంటే రూ.4,734 పెరిగిన ఈ ఇంథన ధరలు తీవ్ర ఫ్రభావాన్ని చూపాయి. ఈక్రమంలోనే నాన్ సబ్సిడైజ్డ్ ఎల్‌పీజీ వంట గ్యాస్ ధర సైతం 14.2 కిలోల సిలిండర్‌పై రూ.5 వంతున పెరిగింది. ప్రస్తుతం దేశ రాజధానిలో ఈ సిలిండర్ ధర రూ.706.50గా ఉంది. ఇలా సబ్సిడీ రహిత గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడమూ నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. మార్చి 1 ఈ సిలిండర్ ధర రూ.42.5 అదనంగా పెరిగిన సంగతి తెలిసిందే. ప్రతి సబ్సిడీ గ్యాస్ హో ల్డర్‌కు ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు సబ్సిడీపై లభిస్తాయి. ఆ కోటా దాటిన తర్వాత వినియోగదారుడు సబ్సిడీ రహిత సిలిండర్‌ను కొనుగోలు చేయాలి. కాగా పెరిగిన ఇంధన ధరలు జెట్ ఎయిర్‌వేస్‌కు గోరుచుట్టుపై రోకటిపోటు లాంటివ ని ఇప్పటికే సమస్యల నుంచి బైటపడేందుకు నానాతిప్పలు పడుతున్న ఈ సంస్థ ప్రగతికి ప్రతిబంధకమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.