బిజినెస్

పన్ను ఎగవేతదారుల పట్ల పారాహుషార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: పన్ను ఎగవేతదారులపై బుధవారం కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ విభాగం (సీబీఐసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో పన్ను వసూళ్ల శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేకించి జీఎస్టీ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కొత్త దరఖాస్తుల ప్రాసెసింగ్‌లో మెళకువగా ఉండి గతంలో రిజిస్ట్రేషన్ జరిగివున్న వాణిజ్య సంస్థలు నిబంధనలను సక్రమంగా అమలు చేయకుంటే వాటి అభ్యర్థనలను నిర్ధ్వందంగా తోసిపుచ్చాలని ఆదేశించింది. కొత్త రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన దరఖాస్తులను పూర్తిగా విశే్లషించుకుని యజమాని, మేనేజింగ్ కమిటీ డైరెక్టర్లు, సభ్యులు, అనుబంధ సభ్యులు, బోర్డు ధర్మకర్తలు తదితర అంశాలు సక్రమంగా లేకుంటే వెంటనే ఆ దరఖాస్తులను రద్దు చేయాలన్నారు. ఒకవేళ ఇదే సమాచారంతో మరేదైనా సంస్థ రిజిస్ట్రేషన్ ఉందా అన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని సూచించింది. అసలు రిజిస్ట్రేషన్లు చేసుకోకుండానే కొన్ని వ్యాపార సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని తమ దృష్టికి వచ్చిందని, అలాగే గతంలో రద్దయిన రిజిస్ట్రేషన్లకు కాన్సిలేషన్ ఎత్తివేతకు దరఖాస్తు చేయకుండానే కొంతమంది తిరిగి కొత్త రిజిస్ట్రేషన్‌కు వస్తున్నారని, ఆ రకంగా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారని సీబీఐసీ పేర్కొంది. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన దరఖాస్తుల పర్యవేక్షణకు సక్రమమైన అధికారిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఒక సంస్థ ఒకే రాష్ట్రం నుంచి రెండు దరఖాస్తులు సమర్పించినపుడు జాగ్రత్తగా పరిశీలించాలని ఫీల్డ్ ఆఫీసర్లను ఆదేశించింది. ఒక పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్)పై ఒకే రాష్ట్రంలో వివిధ రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటును వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టం కల్పిస్తోంది. ఐతే ఇందుకు సంబంధించి దరఖాస్తు దారుడు సమర్పించిన వివరాలు సక్రమంగా లేకపోతే ఆ దరఖాస్తును తిరస్కరించే అధికారం సంబంధిత అధికారులకు ఉంటుందన్న విషయాన్ని సీబీఐసీ గుర్తు చేసింది. వ్యాపారం ఆరంభించిన తేదీతో సహా రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోదలుచుకుంటున్నారనే వివరాల వరకు క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను అదేశించింది.