బిజినెస్

రెండో రోజూ నష్టాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 4: ముంబయి స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) వరుసగా రెండో రోజు కూడా నష్టాల్లో కొనసాగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేటును 0.25 శాతం తగ్గించడమేగాక, 2019-20 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి తగ్గవచ్చని అంచనా వేయడంతో, దాని ప్రభావం స్టాక్ మార్కెట్‌పై పడింది. కొంత సేపు ఆటుపోట్లకు గురైన సెనె్సక్స్ చివరికి 192.40 పాయింట్లు (1.49 శాతం) నష్టపోయి, 38,684.72 పాయింట్లకు చేరింది. అదే విధంగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో సెనె్సక్స్ 45.95 పాయిం ట్లు (0.39 శాతం) నష్టపోయి, 11,598 పాయింట్లకు పడిపోయింది. గురువారం నాటి ఆర్బీఐ ఆధ్వర్యంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం తీరుతెన్నులను గమనించడంలోనే అటు మదుపరులు, ఇటు స్టాక్ బ్రోకర్లు మునిగిపోయారు. తీరా నిర్ణయం వెలువడిన తర్వాత, ప్రతికూల వాతావరణం కనిపించింది. వడ్డీ రేటు తగ్గిందన్న సమాచారంతో యాంటీ సెంటిమెంట్ బలంగా పని చేసింది. ఫలితంగా షేర్ల అమ్మకాల జోరు పెరిగి, ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగింది.