బిజినెస్

ఆదాయ పన్ను రిటర్న్‌లు సమర్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీలు, లేదా వ్యక్తిగత ఆదాయ వ్యయాలకు సంబంధించిన అంచనాలతో ఐటీ రిటర్స్ ఫారాలను సమర్పించాల్సిందిగా ఆదాయ పన్ను శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వేతన జీవులు, కొన్ని సంస్థలు సమర్పించాల్సిన ఐటీఆర్-1 లేదా ‘సహజ్’లో ఎలాంటి మార్పుల్లేవని, ఐతే ఐటీఆర్ 2,3,5,6,7లోని కొన్ని సెక్షన్లను మాత్రం హేతుబద్ధీకరించడం జరిగిందని అధికారులు తెలిపారు. వ్యక్తిగత, సంస్థాగత, కంపెనీల పరంగా 2018-19లో వచ్చి న ఆదాయ ఆధారంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాల ను సమర్పించాలి. వ్యక్తిగతంగా జీతభత్యాలు, ఒక ఇంటి ఆస్తి, రూ.5వేలకంటే అధికంగా వ్యవసాయ రా బడి, వడ్డీల ద్వారా మొత్తం వార్షికాదాయం రూ.50 లక్షలకు లోబడిన వారు ఐటీఆర్-1, వ్యాపారం లేదా వృత్తికి సంబంధించిన ఆదాయాలు లేనివారు ఐటీఆర్-2, వ్యక్తిగత, వాణిజ్యం, వృ త్తి వంటి ఆదాయాలుంటే ఐటీఆర్-3ని సమర్పించాలి.