బిజినెస్

జెట్ విమానాలకు ఇంధన సరఫరా బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 5: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌కు ఇంధన సరఫరాను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ శుక్రవారం నిలిపివేసింది. సరఫరా చేసిన ఇంధనానికి చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడం వల్లనే శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇంధన సరఫరా నిలిపివేయాల్సి విచ్చిందని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్ధ ఐఓసీ పేర్కొంది. ఇందుకు సంబంధించి జెట్ ఎయిర్‌వేస్ నుంచి స్పందన రావాల్సివుంది. ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం జెట్ ఎయిర్‌వేస్ యాజమాన్యాన్ని చేపట్టేందుకు సంబంధించిన కసరత్తులో ఉంది. ఈక్రమంలో తొలిచర్యగా విమాన నిర్వహణలపై దృష్టి నిలిపి నడుస్తున్న విమానాల సంఖ్యను కేవలం 26కు పరిమితం చేసిన సంగతి తెలిసిందే. బ్యాంకుల కన్సార్టియం రూపొందించిన ఒక ప్రణాళికను జెట్ ఎయిర్‌వేస్ బోర్డు ఆమోదించింది. ఇందులో భాగంగా 1,500 కోట్ల రూపాయలు తక్షణ సాయంగా బ్యాం కుల కన్సార్టియం జెట్ ఎయిర్‌వేస్‌కు అందజేయాల్సివుంది. ఆ నిధులను 51 శాతం ఈక్విటీలుగా మార్చడం జరగుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ విమానయాన సంస్ధకు ఎలాంటి నిధులూ అందలేదు.