బిజినెస్

పెరుగుతున్న విమాన ప్రయాణ చార్జీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: దేశంలో విమాన ప్రయాణ చార్జీలు గత కొన్ని నెలల నుంచి పెరుగుతున్నాయి. ప్రధానంగా బోయింగ్ 737 మాక్స్ విమానాల నిర్వహణను నిలిపివేసినప్పటి నుంచి ఈప్రభావం విమాన చార్జీలపై పడిందని ఫిచ్ రేటింగ్స్ అధ్యయన నివేదిక వెల్లడించింది. ప్రస్తుత సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆసియా వ్యాప్తంగా విమాన ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని, ఇందుకు సీజనల్ మార్పు కూడా కారణంగా కావచ్చని ఫిచ్ నివేదిక పేర్కొంది. ఆర్థిక సంక్షోభంలో కూరకుపోవడంవల్ల జెట్ ఎయిర్‌వేస్ విమానాల నిర్వహణను క్రమంగా తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే స్పైస్‌జెట్ సైతం 737 మాక్స్ విమానాల నిర్వహణను నిలిపివేసింది. ఈక్రమంలోనే ఇండిగో కూడా ఫిబ్రవరి రెండో పక్షం నుంచి విమానాల నిర్వహణ సంఖ్యను తగ్గించుకుంది. ట్రాఫిక్ డిమాండ్‌కు అనుగుణంగా ప్రయాణికుల సంఖ్య లేకపోవడం వల్లే గడచిన మార్చి నెల వరకు విమానాల నిర్వహణపై ప్రతికూల ప్రభావం ఏర్పడిందని ఫిచ్ నివేదించింది. ప్రధానంగా తక్కువ విమాన టికెట్ చార్జీలుండే స్పైస్‌జెట్, ఇండోనేషియాకు చెందిన లయన్ ఎయి ర్, సింగపూర్‌కు చెందిన సిల్క్‌ఎయిర్ సైతం తమ 737 మాక్స్ విమానాలను నిలిపివేశాయి. ప్రత్యేకించి గత నెలలో ఇథియోపియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 157మంది మృత్యువాత పడటంతో ఆ ప్రభావం ఆసియా దేశాల్లో విమానయా న సంస్థలపై పడిందని ఆ నివేదిక విశే్లషించింది. ట్రాఫిక్ పుంజుకునే వరకు ప్యాసింజర్ కిలోమీటర్ రేటింగ్స్ (ఆర్‌పీకే) వృద్ధిరేటు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆ అధ్యయనం వెల్లడించింది. గడచిన జనవరి మాసంలో ఆర్‌పీకే సుమారు 12.4 శాతం తగ్గిందని పేర్కొంది. కాగా విమానయాన సంస్థల్లో రెండో అతిపెద్ద సంస్థ అయిన జెట్ ఎయిర్‌వేస్ దాని అనుబంధ సంస్థలు దేశీయ స్టాక్ మార్కెట్‌లో గత జనవరి నుంచి క్రమంగా నష్టాలను సంతరించుకుంటున్నాయని తెలిపింది.