బిజినెస్

ఇళ్ల నిర్మాణంలో విస్తరించనున్న ‘పోద్దార్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 7: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)పై ప్రధానంగా ఆధారపడిన ముంబయి నగరానికి చెందిన స్థిరాస్తి వ్యాపార సంస్థ ‘పొద్దార్ హౌసింగ్’ పెద్దయెత్తున సంస్థ కార్యకలాపాలను విస్తరణకు ప్రణాళికలను రూపొందించింది. వచ్చే కొన్ని సంవత్సరాల కాలంలో సుమారు 41వేల యూనిట్లను ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథం ద్వారా చేపట్టాలని నిర్ణయించింది.
ఇప్పటికే ఈ కంపెనీ తొలి ప్రాజెక్టుకు సంబంధించిన తొలివిడత కార్యక్రమం ‘పొద్దార్ వండర్ సిటీ’ని పిఎంఏవై పథకం ద్వారా తానే జిల్లా పొరుగునే ఉన్న బద్లాపూర్ తూర్పు ప్రాంతంలో చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టులోని తొలివిడత (ఫేజ్-1)లో 1.2 మిలియన్ చదరపు గజాల స్థలంలో 1,863 ప్లాట్లు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 4,000 యూనిట్లు నిర్మించాలనే లక్ష్యం ఉంది. దీన్ని వచ్చే కొన్ని సంవత్సరాల్లో పూర్తి చేయడం జరగుతుంది. సక్రమంగా అమలు చేస్తే పీఎంఏపై పథకం అత్యద్భుతమైనది, సరసమైన ధరలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం తమ సంస్థకు సంప్రదాయబద్ధమైన అలవాటేనని మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ పోద్దార్ ఆదివారం నాడిక్కడ పేర్కొన్నారు. తమ కంపెనీ త్వరలో మరో రెండు ప్రాజెక్టులను పీఎంఏవై పథకం ద్వారా చేపడుతుందని, ఇందుకోసం పూనేలోని థానియంద్ చెకాన్ ప్రాంతంలోని కొన్ని ప్రదేశాలను ఎంపిక చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఇంతకు మించిన వివరాలేవీ పోద్దార్ తెలియజేయనప్పటికీ మూడు ప్రాంతాల్లో సుమారు 41,000 యూనిట్లను పీఎంఏవై ద్వారా చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు ఆ కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చెకాన్‌లో సుమారు 25000 యూనిట్ల నిర్మాణాన్ని చేపట్టడంతోబాటు ఒక టౌన్‌షిప్‌ను నిర్మాణం కూడా చేపట్టాలని కంపెనీ నిర్ణయించింది. ఈ కంపెనీ గత ఏడేళ్లుగా సుమారు 4,200 యూనిట్ల నిర్మాణం పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.